అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలే ప్రమాద హెచ్చరికలు
రాయచోటిలో విద్యార్థుల చేతిలో ఉపాధ్యాయుడు హత్యపై పెదవి విరుపు
సెల్‌ఫోన్లతోపాటు ఇతర వ్యవహారాలతో వికృత చేష్టలు
ఇలాగే కొనసాగితే భావి భారత పౌరుల భవితవ్యం అగమ్యగోచరం
ఇటీవలే గంజాయి మత్తులో రైలు కింద పడి ప్రాణం తీసుకున్న ఇరువురు విద్యార్థులు
సాక్షి రాయచోటి : భావి భారత పౌరులు.. అలాంటి చిన్నారులు చేస్తున్న వికృత చేష్టలు సమాజం ఎటుపోతుందోనన్న సందేహాలకు సమాధానం దొరకని పరిస్థితి. బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదే కాదు..సమాజంలో తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. చిన్నారులు ఏం చేస్తున్నారో..ఎటు పోతున్నారో.. ఎలా వ్యవహారిస్తున్నారో చూసుకో కపోతే అనేక తప్పులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకటి, రెండు దశాబ్దాల కిందట నాగరిక పోకడలు అంతగా లేని కాలంలో...చిన్న పిల్లలు, బాలలు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని చెప్పిందే వేదంగా నడిచే పరిస్థితి ఉండేది.
కాలం మారింది, కంప్యూటర్ పోకడలు పెరిగిన ప్రస్తుత కాలంలో చిన్నారులు అడిగిందే తడవుగా ఏదీ కాదనలేదన్నది ఇప్పటి పరిస్థితి. భావి భారత బాలలకు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పకపోతే భవిష్యత్‌లో ఎలాంటి తప్పుడు పనులు చేసినా అది అందరిమీద పడుతుంది. ఒకనాడు ఇంటి పని మొదలుకొని పాఠశాల ముగియగానే ఇంటికి చేరుకుని కుటుంబీకులతో తిరుగుతుండడంతో వారి ప్రవర్తన, నియమావళి తెలిసేది. ప్రస్తుతం సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ముందుకు వెళుతూ టెక్నాలజీ యుగంలో విలాసవంతానికి పోతుండడంతో అనుకోని ఘటనలు ఎదురవుతున్నాయి.
సెల్‌ఫోన్లు చూస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాలి
చిన్నారులు, బాలలు (18 ఏళ్లలోపు) సెల్‌ఫోన్లు చూస్తున్నారంటే కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళితే అనేక రకాల వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తాయి. పైగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. అవతలి వారు పంపిన లింక్‌ౖò³ ఒక చిన్న క్లిక్ చేస్తేనే ఖజానా ఖాళీ అవుతుంది.
అదొక్కటే కాదు...అనేక రకాల అశ్లీల బొమ్మలు, లైక్‌లు, సబ్‌స్రై్కబ్‌ల కోసం రకరకాల అసత్య ప్రచారాలు జరుగుతున్న తరుణంలో చిన్నారులకు తెలియకుండా జరిగే ఒక క్లిక్‌తో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవమే. అన్నింటి కంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇన్‌స్ర్ట్రాగామ్, వాట్సాప్‌లను క్రియేట్ చేసుకుని పెద్దలకు తెలియకుండా చూసిన తర్వాత డెలీట్ చేసి ఏమి తెలియనట్లు యదావిధిగా ఫోన్‌ను అందిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు పుస్తకాలు అలవాటు చేయడం, ఆటల ద్వారా
వారిలో వినోదం పంచడం లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి.
కేసులతో జీవితాలు ఛిద్రం
అన్నమయ్య జిల్లాలో అవనసరంగా చెడు మార్గంలో పయనిస్తూ పోలీసు కేసులతో తమ జీవితాలను వారే చిధ్రం చేసుకుంటున్నారు. రెండేళ్ల కిందట మదనపల్లె, రాజంపేట పరిధిలో మైనర్లు పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నారు. నెలన్నర కిందట పీలేరులో గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు రైలు కిందపడి చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే రాయచోటిలో మందలించిన టీచర్‌పై ముగ్గురు విద్యార్థులు చితకబాదడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటనను తలుచుకుంటేనే గగుర్పాటు కనిపిస్తోంది.
పెరిగిన వింత పోకడలు
సమాజంలో చదువుకునే బాలల్లో వింత పోకడలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా సెల్‌ఫోన్లలో క్రైం స్టోరీలు చూడడం మొదలు ఇతర అనేక రకాల కారణాలతో విద్యార్థులు కూడా వేరే వ్యవహారాలకు బానిసలవుతున్నారు. ఒకరిని కొట్టినా, తిట్టినా శిక్ష కఠినంగా ఉంటుందన్న విషయం తెలియకనో, లేక ఏమౌతుందిలే అన్న ధీమాతో ఏదంటే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువులకు తెలియకుండా రహస్య ప్రాంతాలను ఎంచుకుని సిగరెట్లు తాగడం, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం ఇలా చెడు మార్గాలవైపు పయనిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంగా ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. దీనికితోడు చెడు సావాసంతో అనవసరంగా వెళ్లి వివాదాల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment