annamaya
-
తరుగుతున్న జ్ఞాపకం
అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి బెంగళూరులో కార్పొరేట్ కంపెనీలో ఉన్నతమైన హోదా ఉద్యోగం చేస్తున్నారు. మంచి జీతంతో జీవనం సాఫీగా గడిచిపోతోంది. అయితే ఇటీవల హెడ్ ఆఫీసుకు పంపాల్సిన ముఖ్యమైన మెయిల్స్, వివరాలు పంపకపోవడం , ముఖ్యమైన సమావేశాల తేదీలను గుర్తుపెట్టుకోవడంలేదు. దీంతో ఆయన మీటింగ్‌లకు సైతం వెళ్లలేని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే తాను చెప్పిన మాటలు మరిచిపోయి, తోటి ఉద్యోగులతో గొడవలు పడుతుండటంతో సంస్థ నుంచి మోమోలు జారీ అయ్యాయి. దీంతో కంగుతిన్న ఆయన వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించారు. కొన్నేళ్లుగా ఆయన మధుమేహం మందులు సరిగా వాడకపోవడంతో వ్యాధి పూర్తిగా అదుపులేని కారణంగా మతిమరుపు వచ్చినట్లు డాక్టరు తెలిపారు.జ్ఞాపకాలే మనిషి జీవనానికి ప్రాణం..మనల్ని నడిపించేవి ఆ జ్ఞాపకాలే.. అవే తుడిచిపెట్టుకుపోతే? అప్పుడే చేసిన పని గుర్తు లేకపోతే? కన్నబిడ్డల్ని సైతం పోల్చుకోకపోతే ? అసలు మనెవరో మనకే ఎరుకలేకపోతే? ఆ జీవితం ఎంత దుర్భరమో ఊహించుకోవడమే కష్టం. మతిమరుపు (డిమోన్నియా) రుగ్మతతో బాధపడే వారి పరిస్థితి ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారి వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. – రాజంపేటఇలా ఒక్క జగదీశ్ మాత్రమే కాదు.. చాలామంది మధుమేహంతో బాధపడేవారు తాము మందులు వేసుకున్నా వేసుకోలేదని మళ్లీ వేసుకోవడం, లేకుంటే అసలే వేసుకోకపోవడం, వేసుకున్నట్లుగానే భావించడం వంటివి చేస్తున్నట్లు వైద్యుల తేలింది. ఇందుకు మతిమరుపే కారణమంటున్నారు. ఇప్పుడు మధుమేహుల్లో మతిమరుపు సమస్య ప్రధానంగా మారింది. ఇది జన్మతః వచ్చింది కాదు..కొన్నేళ్లుగా డయాబెటీస్ అదుపులో లేకపోవడంతో వచ్చిన సమస్య. ఈ ప్రభావం మందుల వాడకంపై చూపడంతో శరీరంలో షుగర్ లెవల్స్ పెరగడం, ఒక్కసారిగా తగ్గిపోవడం వంటివి చోటుచేసుకుంటూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.మధుమేహం సోకి పదేళ్లు దాటితే..మధుమేహం సోకి పదేళ్లు దాటిన వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో లేనివారికి ఐదేళ్లకి సమస్య వస్తున్నట్లు నిర్ధారించారు. మధుమేహులలో ఐదుశాతం మందిలో ఈ సమస్య ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.మధ్యవయసు్కల్లో లక్షణాలు పెనుముప్పుఒకప్పుడు 45 ఏళ్లు దాటిన వారిలో షుగర్ లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం ఇరవై..ముప్పై సంవత్సరాల వయస్సు వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. దీంతో కొందరు సరిగ్గా మందులు వాడని పరిస్థితి నెలకొంది. అలాంటి వారిలో వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో గుండెపోటు, మెదడుపోటుతోపాటు మతిమరుపు సమస్యలు వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. పనిచేసే వయస్సులో ఇలాంటి సమస్యలు తలెత్తడం సమాజంపై పెనుముప్పుగా మారుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మతిమరుపు కారణంగానే..మధుమేహం ఉన్న వారిలో మెదడుకు మళ్లీ మైక్రోవాస్క్యులర్ రక్తనాళాలు సన్నబడటంతో రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో మెదడుకు సరైన రక్తప్రసరణ జరగకపోవడటంతో మతిమరుపు వస్నున్నట్లు వైద్యులు అంటున్నారు. అంతేగాకుండా శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో లేని వారిలో ఈ ప్రభావం మెదడుపై చూపి జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీస్తుందంటున్నారు. ఇలా దీర్ఘకాలం పాటు మందులు వాడే వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు.ప్రమాదకరంగా మారుతుందిదీర్ఘకాలంగా మధుమేహం ఉన్న వారిలో మెదడుకు వెళ్లే రక్తనాళాలు సన్నబడటంతో రక్తప్రసరణ తగ్గి మతిమరుపు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో షుగర్ లెవల్స్ పెరగడం, తగ్గడం వల్ల మధుమేహ దుష్ఫలితాలు ఎక్కువ. కాబట్టి వారికి మందులు వేసే బాధ్యతను కుటుంబ సభ్యులే చూడాలి. – డాక్టర్ శివారెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణులు, కడప -
మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : మాజీ సైనికుడి కోటాలో మంజూరైన భూమిని సబ్ డివిజన్ చేయాలని కోరితే.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్యకు యత్నించాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరుగు తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమంలో రామచంద్ర బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడుఅధికారులు, పోలీసు లు వెంటనే అడ్డుకుని అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర మాట్లాడుతూ 2006లో తనతో పాటు మాజీ సైనికులైన మరో ఇద్దరికి వెంకప్పకోట పంచాయతీలో డీకేటీ పట్టాలు మంజూరు చేసినట్టు తెలిపారు. తమ స్థలానికి పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంతో దానికి రోడ్డు అవసరమై కింద ఉన్న ఇద్దరు సైనికుల భూములకు స్కెచ్‌లతో పాటు ఎన్ఓసీని రెవెన్యూ అధికారులు మంజూరుచేసినట్టు తెలిపారు.వారికి ఆనుకుని ఉ న్న తన భూమి సర్వే నంబర్‌ను రీ సర్వేలో భాగంగా తొలగించారని, దీనిపై ఐదేళ్లుగా కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తహ సీల్దార్ ఖాజాబీ మాట్లాడుతూ స్కెచ్‌ల ఆధారంగా రామచంద్రకు న్యాయం చేస్తామని తెలిపారు. -
బంగారు బాల్యం..బాధ్యతతో పదిలం
సాక్షి రాయచోటి : భావి భారత పౌరులు.. అలాంటి చిన్నారులు చేస్తున్న వికృత చేష్టలు సమాజం ఎటుపోతుందోనన్న సందేహాలకు సమాధానం దొరకని పరిస్థితి. బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదే కాదు..సమాజంలో తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. చిన్నారులు ఏం చేస్తున్నారో..ఎటు పోతున్నారో.. ఎలా వ్యవహారిస్తున్నారో చూసుకో కపోతే అనేక తప్పులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకటి, రెండు దశాబ్దాల కిందట నాగరిక పోకడలు అంతగా లేని కాలంలో...చిన్న పిల్లలు, బాలలు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని చెప్పిందే వేదంగా నడిచే పరిస్థితి ఉండేది.కాలం మారింది, కంప్యూటర్ పోకడలు పెరిగిన ప్రస్తుత కాలంలో చిన్నారులు అడిగిందే తడవుగా ఏదీ కాదనలేదన్నది ఇప్పటి పరిస్థితి. భావి భారత బాలలకు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పకపోతే భవిష్యత్‌లో ఎలాంటి తప్పుడు పనులు చేసినా అది అందరిమీద పడుతుంది. ఒకనాడు ఇంటి పని మొదలుకొని పాఠశాల ముగియగానే ఇంటికి చేరుకుని కుటుంబీకులతో తిరుగుతుండడంతో వారి ప్రవర్తన, నియమావళి తెలిసేది. ప్రస్తుతం సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ముందుకు వెళుతూ టెక్నాలజీ యుగంలో విలాసవంతానికి పోతుండడంతో అనుకోని ఘటనలు ఎదురవుతున్నాయి. సెల్ఫోన్లు చూస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాలి చిన్నారులు, బాలలు (18 ఏళ్లలోపు) సెల్ఫోన్లు చూస్తున్నారంటే కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళితే అనేక రకాల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయి. పైగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. అవతలి వారు పంపిన లింక్ౖò³ ఒక చిన్న క్లిక్ చేస్తేనే ఖజానా ఖాళీ అవుతుంది.అదొక్కటే కాదు...అనేక రకాల అశ్లీల బొమ్మలు, లైక్‌లు, సబ్స్రై్కబ్ల కోసం రకరకాల అసత్య ప్రచారాలు జరుగుతున్న తరుణంలో చిన్నారులకు తెలియకుండా జరిగే ఒక క్లిక్‌తో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవమే. అన్నింటి కంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇన్‌స్ర్ట్రాగామ్, వాట్సాప్‌లను క్రియేట్ చేసుకుని పెద్దలకు తెలియకుండా చూసిన తర్వాత డెలీట్ చేసి ఏమి తెలియనట్లు యదావిధిగా ఫోన్‌ను అందిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు పుస్తకాలు అలవాటు చేయడం, ఆటల ద్వారా వారిలో వినోదం పంచడం లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. కేసులతో జీవితాలు ఛిద్రం అన్నమయ్య జిల్లాలో అవనసరంగా చెడు మార్గంలో పయనిస్తూ పోలీసు కేసులతో తమ జీవితాలను వారే చిధ్రం చేసుకుంటున్నారు. రెండేళ్ల కిందట మదనపల్లె, రాజంపేట పరిధిలో మైనర్లు పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నారు. నెలన్నర కిందట పీలేరులో గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు రైలు కిందపడి చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే రాయచోటిలో మందలించిన టీచర్‌పై ముగ్గురు విద్యార్థులు చితకబాదడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటనను తలుచుకుంటేనే గగుర్పాటు కనిపిస్తోంది.పెరిగిన వింత పోకడలు సమాజంలో చదువుకునే బాలల్లో వింత పోకడలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా సెల్ఫోన్లలో క్రైం స్టోరీలు చూడడం మొదలు ఇతర అనేక రకాల కారణాలతో విద్యార్థులు కూడా వేరే వ్యవహారాలకు బానిసలవుతున్నారు. ఒకరిని కొట్టినా, తిట్టినా శిక్ష కఠినంగా ఉంటుందన్న విషయం తెలియకనో, లేక ఏమౌతుందిలే అన్న ధీమాతో ఏదంటే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువులకు తెలియకుండా రహస్య ప్రాంతాలను ఎంచుకుని సిగరెట్లు తాగడం, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం ఇలా చెడు మార్గాలవైపు పయనిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంగా ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. దీనికితోడు చెడు సావాసంతో అనవసరంగా వెళ్లి వివాదాల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. -
లంకమల.. జీవ వైవిధ్యంతో కళకళ
లంకమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు ప్రత్యేకత చాటుకోగా.. వివిధ రకాల పక్షులు, జంతువులు.. పలు రకాలైన వృక్షాలు, మొక్కలు, రంగురంగుల పుష్పాలు.. ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగిన వన మూలికలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇక వానాకాలంలో లంకమల్లేశ్వరుని కోనలో జలపాత హొయలు పర్యాటకులను పరవశింపజేస్తుంది. సిద్దవటం : అన్నమయ్య జిల్లాలోని లంకమల అభయారణ్యం ఎంతో ప్రత్యేకమైనది.. సుమారు 46,442 .8 హెక్టార్లలో విస్తరించి జీవ వైవిధ్యాన్ని చాటుతోంది. సుమారు 300 పైగా పక్షుజాతులు, వన్య మృగాలకు ఆవాసంగా ఉంది. ఇక పక్షుల జాతుల్లో చాలా అరుదైన పక్షి జాతి నీలి నల్లంచి ఇక్కడి ప్రత్యేకతగా చెప్పక తప్పదు. 1986వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కలివి కోడి కూడా లంకమల అభయారణ్యంలో అప్పట్లో కనిపించడం కూడా విశేషంగా చెప్పు కోవచ్చు. కలివి కోడిని పోలిన పక్షిగా రాతికాలేడు, ఎర్రచిలుక కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. లంకమల అభయారణ్యంలో అరుదైన పక్షుల్లో బంగారు రొమ్ము ఆకుపిట్ట, ఎర్రగొంతు ఈకపట్ల పిట్ట, నీల ఈక పట్ల పిట్ట, తోక నల్లంచి, పెద్ద ఆకురాయి, గిజిగాడు పిట్ట, చారల గొంతు వడ్రంగి పిట్ట, వర్ణడేగా, అడవి రామదాసు, బుడమాలి గద్ద, జాలిడేగా, నీటి కాకి, తెరభిముక్కు కొంగ, నల్ల గద్ద, తోకపిగిలి పిట్ట, నల్ల తల వంగ పండు, ఎర్రగువ్వ, కుందేలు సాలువ, పచ్చగువ్వ తదితర పక్షి జాతులు లంకమల అభయారణ్యంలో కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి. లంకమలలో పెరిగిన వన్యప్రాణులు లంకమల అభయారణ్యంలో వన్యప్రాణుల సంతతి క్రమంగా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. సహజసిద్దంగా ఉండే పచ్చిక మైదానాల్లో తిరుగుతూ అవి ఆకలిని తీర్చుకుంటున్నాయి. అడవుల్లో ఎక్కువ గా వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో అటవీ అధికారులు కెమెరాలను కూడా అమర్చారు. పలు కెమెరాల్లో అడవి జంతువులు కణితిలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, పొడదుప్పిల చిత్రాలు నిక్షిప్తంగా ఉన్నాయి. ఒకప్పుడు తక్కువగా ఉండే చిరుత పులుల సంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో నీరు లభించక జింకలు, దుప్పులు, ఎలుగు బంట్లు, చిరుత పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. అడవి జంతువుల సంచారంలో గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేవారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు అడవిలోనే పలు ప్రాంతాలలో సాసర్ ఫీట్లు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.అరుదైన వన మూలికలు లంకమల అభయారణ్యంలో పక్షులు, వన్య మృగాలతో పాటు, వన మూలికలకు ప్రసిద్ధి గాంచింది. నన్నారి షరబత్కు ఉపయోగించే సుగంది వేర్లు, సార పప్పు, ఉసిరి, నేరేడు, ఏనుగు కుందేలు చెట్టు, అతిపత్తి చెట్టు, మగలింగచెట్టు, ఇప్ప చెట్టు ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అడవిలో ఎన్నో రకాలు ఉన్నాయి. అంతే గాకుండా పాలగడ్డలు, మగసిరి గడ్డలు, పాము కాటు విరుగుడుకు వాడే తెల్లీశ్వరి, నల్లీశ్వరి, నాగముష్టి, విషనాభి చెట్టు, ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం , భూచక్రగడ్డ తోపాటు జిగురు వంటివి లంకమల అభయారణ్యంలో లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కపర్థీశ్వరుని కోన, శ్రీ నిత్యపూజ స్వామి కోన, శ్రీ లంకమలేశ్వర స్వామి ఆలయం, కొండ గోపాలస్వామి ఆలయాలతోపాటు నీటి గుండాలు, గలగలా పారే సెలయేర్లు వంటివి కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. -
అర్ధరాత్రి భూ అక్రమార్కుల అరాచకం!
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత భూ అక్రమార్కులు రెచి్చపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నది. అదే రీతిలో కొంతమంది భూ అక్రమార్కులు అదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని చర్చి ప్రాంగణంలోని ఓ భవనాన్ని కూల్చి వేసేందుకుయతి్నంచి అరాచకం సృష్టించారు. స్థానికులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.రైల్వేకోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లూథరన్ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లాపై పోలిన సుబ్బరాయుడు అలియాజ్ తిమోతీ టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరంతా 4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దాదాపు 50 మంది అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూలి్చవేసేందుకు యతి్నంచి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్‌ను పూర్తిగా కూలి్చవేశారు. అక్కడ నిద్రిస్తున్న వారిపై దాడికి దిగారు.దాడుల్లో రత్నం, రామచంద్రయ్యకు గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూలి్చవేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘటనా స్థలానికి చేరుకుని తిమోతి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రైల్వేకోడూరు పట్టణం, మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లి, ప్రధాన రహదారికి ఇరువైపులా భూములు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి.దీనికితోడు ప్రభుత్వం మారగానే చర్చి భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్భూములు, వంకపోరంబోకులు, ఆర్అండ్బీ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోట్ల విలువచేసే ఆర్అండ్బీ జాగాను కబ్జా చేయడానికి ప్రయతి్నంచి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగబడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కువైట్‌లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు
వాల్మీకిపురం: ఎన్నో ఆశలతో కువైట్‌కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేనొక్కడినే మేత వేస్తున్నా..నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎండలకు నా వల్ల కావడంలేదు. ఎవరైనా సాయం చేయండి.. లేదంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన రామచంద్రరావ్ కుమారుడు శివ (40) అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం బోయపల్లికి చెందిన శంకరమ్మను 18ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి వెన్నెల, వనిత అనే కుమార్తెలు ఉన్నారు. శివ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బిడ్డలను చదివించలేని పరిస్థితి ఉండడంతో పెద్ద కుమార్తెతో పాటు భార్యను సైతం కూలీకి తీసుకెళ్లి వచ్చిన డబ్బుతో చిన్న కుమార్తె వనితను చదివిస్తున్నాడు. ఈ క్రమంలో కువైట్ వెళ్లి డబ్బు సంపాదించి పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి డబ్బులు పోగేసుకొని రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్‌ను సంప్రదించాడు. అతని ద్వారా శివ నెలక్రితమే కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో గొర్రెలు, పావురాలు, బాతులు మేపడానికి బాధితుడిని పెట్టారు. అయితే అక్కడ సంబంధిత యజమానులు నాలుగు రోజులైనా గొర్రెల దగ్గరికి రాకపోగా సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయాడు. ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్‌కు సమాచారం అందించాడు. తిరిగి రావడానికి డబ్బులు ఎవ్వరు ఇస్తారని, నువ్వు అక్కడే పని చేయాల్సిందేనని ఏజెంటు చెప్పడంతో తన దగ్గర డబ్బులు లేవని, భార్య నిస్పహాయత చూపడంతో బాధితుడు చేసేది ఏమీలేక తనకు చావే శరణ్యమని, తనను ఎవరైనా దయగలవారు ఇండియాకు తీసుకెళ్లాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎంబసీ వారు స్పందించారు. బాధితుడు శివను భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.మా నాన్నను భారత్‌కు రప్పించండిమా నాన్న శివ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో ఉన్నాడు. దయచేసి ఎవరైనా సహాయం చేసి మా నాన్నను భారత్‌కు రప్పించండి.– వనిత, బాధితుడి కుమార్తె -
వామ్మో.. 35 నాగులు!
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఇంటిముందు అరుగు బండ కింద 35 పాములు బయటపడ్డాయి. వీటిని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురై వాటిని చంపేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట సమీపంలోని డేగానిపల్లెలో మంజు ఇంటివద్ద పొడవాటి అరుగు బండ ఉంది. దాని అడుగు నుంచి ఓ పాము బయటకు రాగా.. గమనించిన గ్రామస్తులు భయంతో చంపేశారు. ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా పాములు రావడంతో గ్రామస్తులు బండను తొలగించి చూడగా.. మొత్తం 35 పాములు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నివాస గృహాల మధ్య అరుగు బండకింద పాము గుడ్లు పెట్టగా.. వాటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. ఇవన్నీ నాగుపాము జాతికి చెందినవని గ్రామస్తులు తెలిపారు. -
3 నెలలు..7 వేల లావాదేవీలు
రాజంపేట: అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం టి.కందులవారిపల్లెకి చెందిన సైబర్ నేరగాళ్లు సాయికిరణ్, ప్రశాంత్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని పశ్చిమ బెంగాల్ పోలీసులు కోల్‌కత తీసుకెళ్లారు. టి.కందులవారిపల్లెకి చెందిన సాయికిరణ్ ఇటీవల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లోని తన ఖాతాలో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఖాతా ఫ్రీజ్ అయి ఉండటంతో బ్యాంక్ అధికారులను కలిశాడు. వారికి అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు సాయికిరణ్‌తో టైంపాస్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వచ్చి సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయికిరణ్‌పై కోల్‌కతలో సైబర్ కేసు నమోదై ఉండటంతో పోలీసులు అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోమవారం కోల్కత్తా పోలీసులు రాజంపేటకు చేరుకున్నారు. పట్టణ పోలీసుల అదుపులో ఉన్న సాయికిరణ్‌తోపాటు అతడికి సహకరించిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లారు. సాయికిరణ్ మూడునెలల వ్యవధిలో ఏడువేల లావాదేవీలు చేసినట్లు తెలిసింది. ఇందుకు 30 సిమ్ కార్డులను వినియోగించినట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో దేశవ్యాప్తంగా పలువురి బ్యాంకు ఖాతాలను హ్యాక్‌చేసి కోట్లాది రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. కొన్ని ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేరాలపై కోల్‌కతలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
అన్నమయ్య సంకీర్తనలు- సామాజిక దృక్పథంపై కార్యక్రమం
నార్వే : అన్నమయ్య సంకీర్తనలు - సామాజిక ధృక్పథంపై ‘వీధి అరుగు’ వేదికగా ఈ నెల 25న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అన్నమాచార్య సంకీర్తనలతో సమాజంలో మార్పు, చైతన్యం ఎలా తీసుకురావచ్చని నిర్వహకులు తెలిపారు. ఆధ్యాత్మిక భావనల ద్వారా ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు.. సమకాలీన సామాజికాంశాలపై పోరాటం చేయటానికి గురు జ్యోతిర్మయి ఎంచుకున్న సాధనాలేమిటి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసురాలు, సంఘసేవకులు కొండవీటి జ్యోతిర్మయి విశిష్ట అతిథిగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని వేదిక నిర్వహాకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు. నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది తెలుగు భాషాభిమానులు ‘వీధి అరుగు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్సైట్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చదవండి: ఒక మనిషికి ఇన్ని పేర్లా?.. -
ఆపాత మధురం
మనకు వాగ్గేయకారులున్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, శ్యామశాస్త్రి ...వీళ్లందరూ సంగీతాన్ని నాదోపాసనగా స్వీకరించి వాగ్గేయకారులైనారు. ఒకచోట స్థిరంగా కూర్చుని, కాగితం, కలం పట్టుకుని కృతులు రాసినవారు కాదు, వారికి ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో ఏది చెప్పుకోవాల్సి వచ్చినా పరమాత్మకు చెప్పుకున్నారు. బాధకలిగితే, సంతోషం కలిగితే, దుఃఖం పొంగుకొస్తే... ఇంట్లో పెళ్ళి ప్రస్తావన వస్తే... అలా మనసు పొరల్లో ఏ మాత్రం అలికిడి అయినా వారి నిత్యసంబంధం పరమాత్మతోనే. ఆ కృతులలో భావార్థాలతో కూడిన గంభీరమైన చరణాలు ఎన్నో ఉండవు. కానీ ఆర్తితో పరమాత్మను గొంతెత్తి పిలిచారు. అది విన్నవారు పరవశించిపోయారు. ఆ తరువాత ఎంతమంది గురువులు, శిష్యులొచ్చినా పరంపరాను గతంగా ఆ కీర్తనలు చెప్పుకున్నారు. పాడుకున్నారు. అవి కాలగతికి అలా నిలబడిపోయాయి. ఈనాటికీ వాటికి శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాం.ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన జీవితం. వీరిలో కొంతమంది సంసారంలో ఉండి సన్యాసులుగా జీవించారు. మరికొందరు అపారమైన ఐశ్వర్యం ఉండి దానితో సంబంధం లేకుండా జీవించారు. మరికొందరు సంసారంలో ఉండి జ్ఞానంలో జీవించారు. ఏ స్థితిలో ఉన్నా నిరంతరం లోపల ఉండే నాదాన్ని ఉపాసనచేసి దాని ద్వారా పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితిని పొందడానికి వారు సోపానాలు నిర్మించుకున్నారు. వారు చేసిన ఒక్కొక్క కీర్తనను... చివరకు ఆ పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి వింటాడట. ‘‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః’’. పాముని కూడా పడగవిప్పి ఆడేటట్లు చేయగల శక్తి సంగీతానికి ఉంది. ‘‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం, ఏకమాపాత మధురం అన్యమాలోచనామృతం’’. అంటే... సంగీతం, సాహిత్యం రెండూ సరస్వతీదేవి రెండు స్తనాలు. ఒకటి ఆపాత మధురం. ఒకదానిలో క్షీరాన్ని గ్రోలడానికి ఏ విధమైన అర్హతా అక్కర్లేదు. ఆ పాలు తాగితే చాలు తేనె. రెండవ స్తన్యంలో ఉన్న పాలని స్వీకరించడానికి మాత్రం కొంత అర్హత కావాలి. దానికి వివేచన కావాలి. ఆలోచించగలిగిన సమర్ధత ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే శక్తి భగవద్దత్తంగా లభించాలి. అటువంటి అర్థగాంభీర్యంతో ఆయా వాగ్గేయకారుల చేసిన కృతులలో కొన్నింటిని ఎంచుకుని వాటిని గురించి తెలుసుకుందాం. ఆ కీర్తనలలోని ఆర్తిని, అర్థాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పగలిగినవాడు సమర్ధుడా కాడా అని చూడకుండా భగవత్ శబ్దం ప్రతిపాదింపబడితే చాలనుకుని, పాఠకులు పరవశించే హృదయం కలవారు కనుక సాహసం చేస్తున్నా. ఇందులో తప్పొప్పులుండవచ్చు. కానీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం గ్రహించండి. అమ్మ ఆర్తితో పెట్టే అన్నంలో ఒకరోజు పప్పులో ఉప్పు మరిచిపోవచ్చు. అంతమాత్రం చేత ఉప్పులేని పప్పు పెట్టాలన్నది అమ్మ ఉద్దేశం అనలేం కదా. పిల్లాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలన్నదే అమ్మ ఉద్దేశం... అలా సమర్థత ఉందా లేదా అన్నది చూడకుండా ఆ మహానుభావుల కీర్తనలకు భాష్యం చెప్పడంలోని ఉద్దేశాన్ని సదుద్దేశంతో స్వీకరించండి. మొట్టమొదటగా త్యాగరాజ కృతి ‘నగుమోము కనలేని నాదు జాలీ తెలిసీ...’ వ్యాఖ్యానం వచ్చేవారం.‘సంగీత సాహిత్యం’ వాగ్గేయకారుల కీర్తనలకు వ్యాఖ్యానాలు, వారి జీవితచిత్రాల ఆవిష్కరణ లతో కొత్తసీరీస్ ప్రారంభం. మీకు తెలుసా? భగవంతుడికి నివేదించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు. తెలిసి చెసినా, తెలియక చేసినా తప్పు తప్పే కనుక... దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు. పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదించరాదు. చల్లారాకనే నివేదించాలి. నివేదనలో మంచినీటిని కూడా తప్పనిసరిగా పెట్టాలి. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి. -
అన్నమయ్య అచ్చ తెలుగు
నేడు అవటానికి అన్నమయ్య వర్ధంతియే; అయితే, ఆయన వాడిన అచ్చ తెలుగు మాటలను తలచుకోవడం రానున్న తెలుగు సంవత్సరాది ఆవరణంలోకి ముందుగా ప్రవేశించడమే! అన్నమయ్య భాషా ప్రయోగంలో కూడా అప్పటమైన దేశ్య పదజాలపు సొంపు తొణకిసలాడుతుంది. ఆయన దేశ్య పదాభిమానమెంతటిదంటే బాగా ప్రసిద్ధమైన సంస్కృత పదాలకు కూడా దేశ్యపదాలనే వాడుకోవడం గమనించవచ్చు. తెలుగులో మార్గ దేశి కవితాభేదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వస్తువులోను, ఛందస్సులోను, పదజాలంలోను మార్గకవిత్వం సంస్కృత కావ్య సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. దేశికవిత్వం పై అంశాల్లో సంస్కృత మార్గాన్ని అనుసరించక దేశీయ లక్షణాలతో కూడి ఉంటుంది. తెలుగులో శివకవులు దేశి కవితోద్యమాన్ని చేపట్టి తెలుగు కవిత్వంలో ఒక గొప్ప పరిణామాన్ని తీసుకొని వచ్చినారు. నన్నయ మార్గ కవిత్వంలోనే మహాభారత రచన చేయడం వల్ల తరువాతి తెలుగు కవులు ఎక్కువగా మార్గకవిత పైనే మొగ్గు చూపినారని భావించవచ్చు. మార్గ కవిత్వంలో సంస్కృత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పదప్రయోగ విషయంలో సంస్కృతపద బాహుళ్యాన్ని, దీర్ఘ సమాస రచనను గమనించవచ్చు. తిక్కన పదప్రయోగ విషయంలో మాత్రం సంస్కృత ప్రభావానికి లోనుగాక మహాభారత రచనలో దేశ్యపదజాలాన్నే ఎక్కువ పాళ్లలో వాడి దేశి లక్షణాన్ని పాటించినట్లుగా భావించవచ్చు. భాషలో అంతకు ముందు వ్యవహారంలో స్థిరపడి ఉన్న దేశ్య పదజాలాన్ని వాడడమే కాకుండా సంస్కృత శబ్దాలకు కూడా దేశ్య శబ్దాలను స్వయంగా కల్పించి వాడడం కూడా కనిపిస్తుంది. అందుకే అతడు స్వాగతం, న్యాయదృష్టి, పద్మవ్యూహం, రక్త సంబంధం, జీవచ్ఛవం, దేశకాలాలు మొదలైన పదాలను క్రమంగా మేలురాక, నెఱిగుఱి, తమ్మిమొగ్గరం, నెత్తురుపొత్తు, మనుపీనుగ, నేలపొద్దులు ఇత్యాదిగా దేశ్య శబ్దాలను వాడడం కనిపిస్తుంది. 15, 16 శతాబ్దుల్లో వెలసిన తాళ్లపాక కవులు వేలకొద్ది సంకీర్తనలు, ఇతర కృతులు రచించి దేశి కవిత్వానికి పట్టం కట్టి తెలుగు సాహిత్యానికి అపారమైన సేవ చేసినారు. వీరిలో అన్నమాచార్యులు ప్రముఖులు. అన్నమయ్య భాషా ప్రయోగంలో కూడా అప్పటమైన దేశ్య పదజాలపు సొంపు తొణకిసలాడుతుంది. ఆయన దేశ్య పదాభిమానమెంతటిదంటే బాగా ప్రసిద్ధమైన సంస్కృత పదాలకు కూడా దేశ్యపదాలనే వాడుకోవడం గమనించవచ్చు. ఈ దేశ్య పదాలలో కొన్ని తెలుగు భాషలో అంతకు ముందే ఉన్నవీ కావచ్చు. లేదా అన్నమయ్యే స్వయంగా కొన్నింటిని కల్పించుకొనీ ఉండవచ్చు. అలాంటి పదాలను కొన్నింటిని పరిశీలిద్దాం. పాలకూడు: క్షీరాన్నం, పాయసం అనే శబ్దాలకు ఇది దేశ్యపదం. కూడుపదం ఇప్పటిలాగా ఒకప్పుడు మోటుపదం కాదు. సభ్యపదమే. ‘‘పనివడి వెన్నెల పాలకూడు గుడిచి తనివోని పెండ్లి దగిలెగా నీకు’’ అన్నమయ్య నాలుకకు క్షీరాన్నం కంటే, పాయసం కంటే పాలకూడే రుచికరమేమో. గాలిమూట: శరీరం అన్న సంస్కృత పదానికి వాడిన దేశ్య శబ్దం. శరీరం గాలి మూటే కదా! ‘‘గాలిమూట జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి ఆలించి యేమిటి వారమయ్యేమో కాని’’ గాలిమూట జిక్కడమంటే శరీరధారులు కావడమన్నమాట. సూదిరాయి, అంటురాయి: ఇవి ‘అయస్కాంత’ శబ్దానికి వాడిన దేశ్య శబ్దాలు. వీటిలో మొదటిది సూదిని లాగే రాయి అని మధ్యమపదలోపి సమాసం. ‘సూదంటురాయి’ అని వ్యవహారంలో ఉన్న శబ్దం. ‘‘ఆటదియైతేజాలు నంటుకొనేవు గక్కున వాటమైన సూదిరాతివలెనే నీవు’’ గోరొత్తు, గోరితాకు, గోరిచేత, గోరివాత, గోరికోత, గోరిగీత ఇవి ‘నఖక్షతం’ అన్న సంస్కృత శబ్దానికి తెలుగుసేత పదాలు. క్షతం అన్న పదం ఇట ఒత్తు, తాకు, చేత, వాత, కోత అన్న పదాలుగా అనువదింపబడింది. ‘‘తావుకొన్న వలపులు తారుకాణలైన చోట్ల కావరపు గోరొత్తులు కమ్మబూవుతాకులే’’ ‘‘చేసెనా అంగన నీకు చేసన్న లెల్లాను వ్రాసెనా చెక్కుల గోరివాతలెల్లాను’’ చలిమందులు: ‘శీతలోపచారాలు’ అన్న సంస్కృతపదానికి వాడిన తెలుగు దేశ్యపదం. ‘చలిని కలిగించే మందులు’ అని మధ్యమ పదలోపి సమాసం. ప్రబంధాల్లో ఈ పదమెక్కడా కనిపించదు. ‘‘వలపుల వడ దాకె వనిత నిన్నుబాయగ అలరి చలిమందుల కప్పణీవయ్యా’’ పసిడి చీరవాడు: పీతాంబరుడన్న ప్రసిద్ధ సంస్కృత పదానికి దేశ్యీకరణ. చీరపదం అంబర పర్యాయం. ‘‘పసిడి చీరవాడవు పాలు దచ్చితివి గాన పసిడి బోలినది చేపట్టెను నీ కరము’’ ఎముకలయిల్లు: అస్థిపంజరానికి చక్కని దేశ్యపదం. ‘‘భ్రమసి పొరలదోలు పై వేసుకొన్నవాడ యెముకలయింటిలో ఇరవైనాడ’’ పాముపడకవాడు: శేషశయనునికి తెలుగురూపం. ‘‘పాముపడకవాడ పట్టకురా ఆ పామువంటి యారు నీకు బాయదు గదే’’ ఉన్నకాలము: వర్తమానకాలము. ‘‘చన్నకాలమున వున్నకాలమున నున్నవాడు యీ వుపేంద్రుడే’’ చెవులపండుగ: శ్రోత్రపర్వం అన్న సంస్కృతపదానికి తెలుగు ప్రతిపదానువాదం. ‘కనులపండుగ’ వంటి శబ్దం. ‘‘చెప్పేరి నీకొక సుద్ది చెవులపండుగగాను ఇప్పుడొకటె వెదకె నిందాకా నిన్ను’’ ఊరుపుగాలి: నిశ్శ్వాసవాయువుకు తెలుగుపదం. ‘‘వొప్పగుబ్రాణములవి వూరుపుగాలివెంట యెప్పుడు లోనివెలికి నెడతాకును’’ పూసగొండి: కలహశీలుడనే అర్థంలో వాడబడ్డ పదం. తమిళంలో పూశల్ అంటే కలహమని అర్థం. ‘‘పుక్కటవలపుతోడి పూసగొండితనమేల పక్కన మొఱగితేను పగలు రేయౌనా’’ ఇక, ‘మధురవాణి’కి మధురమైన అచ్చ తెలుగుపదం చక్కెరమాటలాడి. అధరామృతానికి తెనుగు సేతలు మోవితేనె, మోవితీపు. ‘పల్లవశయ్య’కు తెలుగురూపాలు చిగురుబడక, చిగురుపాన్పు. ‘పుష్పశయ్య’కు తెలుగు అనువాదం పూబరపు. దీపావళి పండుగకు దేశ్య వ్యవహారం దివ్వెలపండుగ. ‘దివ్వెలపండుగో యనన్’ అని కొరవి గోపరాజు ప్రయోగం. ఇప్పటికీ తెలంగాణంలో దివ్వెలపండుగకు వికృతిరూపమైన దీలి పండుగ వాడుకలో ఉన్నది. సంధ్యాసమయానికి అన్నమయ్య వాడిన దేశ్యశబ్దం దివ్వెలెత్తు పొద్దు. దీపాలు పెట్టే సమయం అని అర్థం. ఇప్పటికీ జానపదులు సంధ్యాసమయాన్ని ‘దీపాలు పెట్టే పొద్దు’ అని వ్యవహరించడం ఉన్నది. నలినదళాక్షుడన్న సంస్కృతానికి అన్నమయ్య తెలుగు అనువాదం కలువరేకులవంటి కన్నులాతడు. పుష్పబాణాలకు దేశ్యప్రయోగం నారసపు విరులు. మకరకుండలాలకు తెలుగు భావానువాదం మొసలిమొకపు సొమ్ములు. ‘‘మొసలిమొకము సొమ్ములు సెవులనుబెట్టి/ విసవిస నవ్వీని వీడు గదమ్మా’’ ముఖపద్మముకు అన్నమయ్య వాడిన పదం తమ్మిమోము. ప్రణయకోపానికి దేశ్యపదం పొలయలుక. తారాపతికి దేశ్యపదం చుక్కలరాయడు. శుభవార్తకు దేశ్యపదం మేలుసుద్ది. ఈ విధంగా అన్నమయ్య ప్రసిద్ధమైన సంస్కృతపదాలు వాడే చోట్ల వాటికి బదులుగా దేశ్యపదాలు వాడి తన దేశ్యపదాభిమానాన్ని చాటుకున్నాడు. - ఆచార్య రవ్వా శ్రీహరి 9959886020