
అన్నమయ్య జిల్లా: తండ్రి మరణించడంతో పుట్టెడు దుఃంఖంలోనూ ఆ విద్యార్థిని పది పరీక్షలకు హాజరైంది. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కందుకూరు పంచాయతీ గొడుగు వారి పల్లికి చెందిన కొత్తోళ్ల వెంకట్రమణ(55) ఆదివారం చింతచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పదేశ్ల కిందటే అదృశ్యమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గణేష్, కుమార్తె గిరిజ. అయితే దుఃఖాన్ని దిగమింగుకుని గిరిజ సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. పరీక్షల అనంతరం తండ్రి కడచూపు కోసం కన్నీటితో ఇంటికి వెళ్లింది.
మద్యం మత్తులో ఎంఈవో!
ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా ఆ ఎంఈవో మాత్రం మద్యం మత్తులో మునిగితేలుతున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శివనాగేశ్వరరావు ఉలవపాడు–1 ఎంఈవోగా ఉన్నారు. ఆయన సోమవారం వి«ధి నిర్వహణలో ఉండగానే యథేచ్ఛగా మద్యం తాగారు. ఉదయం 9.30 నుంచి స్థానికంగా ఉన్న బ్రాందీషాపు పక్కనే ఉన్న దుకాణం వద్ద కూర్చుని దాదాపు గంట సేపు మద్యం తాగారు.
అంతేకాదు.. రాత్రి వేళల్లో ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే నివాసం ఉంటూ.. రాత్రివేళ పాఠశాలలో సైతం మద్యం తాగుతుంటారని స్థానికులు, విద్యార్థులు చెబుతున్నారు. అదేమంటే.. తనకు మంత్రి అనగాని సత్యప్రసాద్ మిత్రుడని.. చెబుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు, చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సైతం వెనుకాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment