4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లు, 50 మంది అనుచరులతో బీభత్సం
స్థానికుల ప్రతిఘటనతో పారిపోయిన వైనం
పచ్చ నేతల అండతో చర్చి కాంపౌండ్ కూల్చివేత
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత భూ అక్రమార్కులు రెచి్చపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నది. అదే రీతిలో కొంతమంది భూ అక్రమార్కులు అదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని చర్చి ప్రాంగణంలోని ఓ భవనాన్ని కూల్చి వేసేందుకుయతి్నంచి అరాచకం సృష్టించారు. స్థానికులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
రైల్వేకోడూరు పట్టణంలోని టోల్‌గేట్ వద్ద పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లూథరన్ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లాపై పోలిన సుబ్బరాయుడు అలియాజ్ తిమోతీ టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరంతా 4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దాదాపు 50 మంది అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూలి్చవేసేందుకు యతి్నంచి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్‌ను పూర్తిగా కూలి్చవేశారు. అక్కడ నిద్రిస్తున్న వారిపై దాడికి దిగారు.
దాడుల్లో రత్నం, రామచంద్రయ్యకు గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూలి్చవేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘటనా స్థలానికి చేరుకుని తిమోతి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రైల్వేకోడూరు పట్టణం, మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లి, ప్రధాన రహదారికి ఇరువైపులా భూములు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి.
దీనికితోడు ప్రభుత్వం మారగానే చర్చి భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్‌భూములు, వంకపోరంబోకులు, ఆర్‌అండ్‌బీ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోట్ల విలువచేసే ఆర్‌అండ్‌బీ జాగాను కబ్జా చేయడానికి ప్రయతి్నంచి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగబడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment