Demolition of building
-
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
అర్ధరాత్రి భూ అక్రమార్కుల అరాచకం!
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత భూ అక్రమార్కులు రెచి్చపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నది. అదే రీతిలో కొంతమంది భూ అక్రమార్కులు అదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని చర్చి ప్రాంగణంలోని ఓ భవనాన్ని కూల్చి వేసేందుకుయతి్నంచి అరాచకం సృష్టించారు. స్థానికులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.రైల్వేకోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లూథరన్ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లాపై పోలిన సుబ్బరాయుడు అలియాజ్ తిమోతీ టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరంతా 4 జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దాదాపు 50 మంది అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూలి్చవేసేందుకు యతి్నంచి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్‌ను పూర్తిగా కూలి్చవేశారు. అక్కడ నిద్రిస్తున్న వారిపై దాడికి దిగారు.దాడుల్లో రత్నం, రామచంద్రయ్యకు గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూలి్చవేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘటనా స్థలానికి చేరుకుని తిమోతి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రైల్వేకోడూరు పట్టణం, మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లి, ప్రధాన రహదారికి ఇరువైపులా భూములు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి.దీనికితోడు ప్రభుత్వం మారగానే చర్చి భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్భూములు, వంకపోరంబోకులు, ఆర్అండ్బీ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోట్ల విలువచేసే ఆర్అండ్బీ జాగాను కబ్జా చేయడానికి ప్రయతి్నంచి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెనుతిరిగారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగబడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
HYDRA: నేలకొరిగిన అక్రమాలు
మణికొండ/మొయినాబాద్: గండిపేట చెరువు ఆక్రమణల చెర వీడుతోంది. ఈ చెరువుకు ఆనుకుని వెలసిన బడాబాబుల నిర్మాణాలను ఎట్టకేలకు తొలగించేందుకు హైడ్రా అధికారులు ఆదివారం శ్రీకారం చుట్టారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలసిన నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన హైడ్రా సిబ్బంది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూలి్చవేశారు. వీటిలో ఒకటి ప్రముఖ న్యాయవాదికి చెందినది కాగా.. మరొకటి కేంద్ర మాజీ మంత్రి బంధువులకు సంబంధించింది కావడం గమనార్హం. అలాగే.. శంకర్పల్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌ను నేలమట్టం చేశారు. అదే రోడ్డులో ఖానాపూర్ దాటిన తర్వాత ఉన్న ఓరో స్పోర్ట్స్ విలేజ్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య.. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో హైడ్రా ఆర్ఎఫ్ఓ పాపారావు ఆధ్వర్యంలో కూలి్చవేతలు కొనసాగాయి. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణమోహన్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్‌గౌడ్ పనులను పర్యవేక్షించారు. మొయినాబాద్ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వెస్టిసైడ్ వెంచర్లో గండిపేట చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి చేపట్టిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. మల్లికార్జున్, చరణ్, జలమండలి డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి డీకే లక్షి్మరెడ్డి, స్థానిక ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో వెస్టిసైడ్ వెంచర్‌లోని భవనాలను కూలి్చవేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన క్రికెట్ మైదానాన్ని ధ్వంసం చేశా రు. చెరువు చుట్టూ వందలాది అక్రమ నిర్మాణాలు ఉండటంతో అయిదు రోజుల పాటు కూలి్చవేతలు చేపట్టనున్నట్లు సమాచారం. చెరువును పూడ్చి.. గండిపేట చెరువును ఆనుకుని ఎకరం, రెండెకరాల భూములు కొనుగోలు చేసిన బడాబాబులు మరింత స్థలాన్ని ఆక్రమించి ఫాంహౌస్‌లు నిర్మించారు. ఖానాపూర్, గండిపేట, మంచిరేవుల, హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, చిన్నమంగళారం, జన్వా డ, మిర్జాగూడ, మియాఖాన్ గడ్డ తదితర గ్రా మాల పరిధిలో వందల సంఖ్యలో ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గండిపేట పరీవాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. ఇదే తరహాలో హిమాయత్ సాగర్ పరిసరాల పరిధిలో వెలసిన నిర్మాణాలపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.క్రిమినల్ చర్యలు కూడా..!ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది. -
డెక్కన్ మాల్ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..
రాంగోపాల్‌పేట్: మినిస్టర్ రోడ్లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించిన రాధే ఆర్కెడ్ (డెక్కన్ భవనం) కూల్చివేతలు ఎట్టకేలకు మొదలయ్యాయి. కూల్చివేతల కాంట్రాక్ట్‌ను మొదట దక్కించుకున్న ఎస్కే మల్లు ఏజెన్సీ వద్ద సరైన మెషినరీ లేకపోవడంతో అధికారులు అదే ధరకు మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలిషన్ అనే మరో కంపెనీకి టెండర్‌ను అప్పగించారు. జపాన్‌లో తయారైన ‘హైరిచ్ కాంబీ క్రషర్’ అధునాతన యంత్రాన్ని గురువారం సాయంత్రం ఈ భవనం వద్దకు తీసుకువచ్చి ఇన్స్టలేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఆరు అంతస్తులున్న భవనాన్ని ఎలా కూల్చాలనే దానిపై కసరత్తు చేశారు. చుట్టూ ఉన్న బస్తీ, అపార్ట్మెంట్లకు నష్టం వాటిల్లకుండా కూలి్చవేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కసరత్తులన్నీ పూర్తి చేసిన తర్వాత గురువారం రాత్రి 11 గంటలకు పనులు మొదలు పెట్టారు. ఈ నెల 19న డెక్కన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. భవనం 70 శాతం దెబ్బ తిన్నదని నిట్ నిపుణుల బృందం తేల్చడంతో కూల్చివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శిథిలాలు నేరుగా కిందకు.. డెక్కన్ భవనాన్ని ఆరో అంతస్తు నుంచి కూల్చివేతలు మొదలు పెట్టి కింద వరకు పూర్తి చేయనున్నారు. గ్రౌండ్ నుంచి 80 అడుగుల ఎత్తులో ఉండే వాటిని కూలి్చవేయవచ్చు. ప్రస్తుతం భవనం 70 అడుగుల ఎత్తు ఉంది. పిల్లర్స్, కాలమ్స్‌ను ఈ మెషిన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. అనంతరం శిథిలాలు మొత్తం కింద ఏర్పాటు చేసిన డ్రాపింగ్ జోన్లో వచ్చి పడతాయి. ఎలాంటి శబ్దాలు, వైబ్రేషన్స్ లేకుండా కూల్చివేయడం ‘హైరిచ్ కాంబీ క్రషర్’ యంత్రం ప్రత్యేకత. భారత్‌లో ఇలాంటి యంత్రాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పారు. కాగా.. అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టడంతో చుట్టుపక్కల నివసించేవాళ్లలో టెన్షన్ మొదలైంది. దీన్ని ఆనుకునే కాచిబోలి బస్తీ, వెనుక వైపు ఉత్తమ్ టవర్స్, గగన్ ప్యారడైస్ అపార్ట్మెంట్ల వాసుల్లోనూ ఆందోళన మొదలైంది. భవనం సమీపంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నా.. స్థానికుల్లో మాత్రం భయం మాత్రం వీడలేదు. మొత్తం భవనం కూల్చిన తర్వాతే.. మిగతా వారి అవశేషాల ఆచూకీ దొరికే అవకాశముంది. ఇందుకోసం మరో నాలుగైదు రోజుల నిరీక్షణ తప్పదు. 12 నుంచి 15 రోజుల్లో.. భవనం కూలి్చవేతకు 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని, శిథిలాలు మొత్తం తరలించి క్లియర్ చేసేందుకు సుమారు 12 నుంచి 15 రోజులు పట్టవచ్చని మాలిక్ ట్రేడింగ్, డిమాలిషన్ కంపెనీ డైరెక్టర్ రెహా్మన్ ఫరూఖ్ తెలిపారు. గతంలో 70 భవనాలను తాము కూలి్చవేయగా ఇలాంటి ఎత్తైనవి 11 అంతస్తులు కూలి్చవేశామని చెప్పారు. ఇందులో వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఉంటాయని ఎక్కడైనా ఫైర్ ఉన్నా మంటలను ఆరి్పవేస్తుందన్నారు. చాలా తక్కువ మ్యాన్ పవర్‌తో కూల్చివేస్తామని ఆయన వివరించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని విశాఖ మహానగర పాలకసంస్థ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చివేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాత గాజువాక జంక్షన్‌లోని 1,033 చదరపు గజాల స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణానికి నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను 221.45 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జీ+4 భవన నిర్మాణానికి అనుమతి పొందిన ఆయన ప్రస్తుతం సెల్లార్+జీ+1 అంతస్తులకు శ్లాబులను పూర్తిచేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో.. పరిశీలించిన అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డును సైతం ఆక్రమించి ఎలాంటి సెట్బ్యాక్లు లేకుండా అడ్డగోలుగా కడుతున్నట్లు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు కాసేపు హడావుడి చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పల్లా అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు మరోవైపు..నగరంలోని ఫుట్పాత్లన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. ‘రైట్ టు వాక్’ పేరుతో తొలగింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న 305 దుకాణాలు తొలగించారు. బీచ్‌రోడ్డులో అడ్డగోలుగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఏర్పాటు చేసిన 70 దుకాణాల్ని జీవీఎంసీ అధికారులు ఆదివారం తొలగించారు. -
గ్యాంగ్‌స్టర్ ఇల్లు నేలమట్టం
లక్నో/కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో కరడుగట్టిన నేరగాడు వికాస్ దుబే గ్యాంగ్ ఎనిమిదిమంది పోలీసులను పొట్టన బెట్టుకున్న ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దుబే స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్డోజర్లతో నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. నేరగాడు దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్ చేశారు. కాల్పులు జరిగినప్పటి నుంచి జాడ తెలియకుండాపోయిన దుబే కోసం 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దుబే లొంగిపోకుంటే, పోలీసులు అతడిని కాల్చి చంపాలని అతడి తల్లి సరళా దేవి అన్నారు. ‘అతడి కారణంగా మేం సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. -
కాప్రాలో ఉద్రిక్తత
హైదరాబాద్: పట్టా చేసుకున్న భూమిని ప్రభుత్వ భూమి అంటూ అక్కడ నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తుండటంతో.. మనస్తాపానికి గురైన బాధితుడు వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొవడానికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన మేడ్చల్ లోని కాప్రా వద్ద గురువారం వెలుగుచూసింది. గత పాతికేళ్లుగా పట్టా ఉన్న 6 ఎకరాల భూమిని ఈ రోజు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. దీనికి పట్టాదారుడు అడ్డుకున్నాడు. అయినా పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.