ఖానాపూర్‌లో రెస్టారెంట్ కూల్చివేత
చిలుకూరు, అప్పోజీగూడల్లో పలు భవనాలు నేలమట్టం
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణల తొలగింపు
హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూలి్చవేతలు
మణికొండ/మొయినాబాద్: గండిపేట చెరువు ఆక్రమణల చెర వీడుతోంది. ఈ చెరువుకు ఆనుకుని వెలసిన బడాబాబుల నిర్మాణాలను ఎట్టకేలకు తొలగించేందుకు హైడ్రా అధికారులు ఆదివారం శ్రీకారం చుట్టారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో వెలసిన నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన హైడ్రా సిబ్బంది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూలి్చవేశారు. వీటిలో ఒకటి ప్రముఖ న్యాయవాదికి చెందినది కాగా.. మరొకటి కేంద్ర మాజీ మంత్రి బంధువులకు సంబంధించింది కావడం గమనార్హం. అలాగే.. శంకర్‌పల్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌ను నేలమట్టం చేశారు. అదే రోడ్డులో ఖానాపూర్ దాటిన తర్వాత ఉన్న ఓరో స్పోర్ట్స్ విలేజ్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు.
భారీ బందోబస్తు మధ్య..
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో హైడ్రా ఆర్‌ఎఫ్‌ఓ పాపారావు ఆధ్వర్యంలో కూలి్చవేతలు కొనసాగాయి. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణమోహన్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్‌గౌడ్ పనులను పర్యవేక్షించారు.
మొయినాబాద్ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వెస్టిసైడ్ వెంచర్‌లో గండిపేట చెరువు ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి చేపట్టిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. మల్లికార్జున్, చరణ్, జలమండలి డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి డీకే లక్షి్మరెడ్డి, స్థానిక ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో వెస్టిసైడ్ వెంచర్‌లోని భవనాలను కూలి్చవేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన క్రికెట్ మైదానాన్ని ధ్వంసం చేశా రు. చెరువు చుట్టూ వందలాది అక్రమ నిర్మాణాలు ఉండటంతో అయిదు రోజుల పాటు కూలి్చవేతలు చేపట్టనున్నట్లు సమాచారం.
చెరువును పూడ్చి..
గండిపేట చెరువును ఆనుకుని ఎకరం, రెండెకరాల భూములు కొనుగోలు చేసిన బడాబాబులు మరింత స్థలాన్ని ఆక్రమించి ఫాంహౌస్‌లు నిర్మించారు. ఖానాపూర్, గండిపేట, మంచిరేవుల, హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, చిన్నమంగళారం, జన్వా డ, మిర్జాగూడ, మియాఖాన్ గడ్డ తదితర గ్రా మాల పరిధిలో వందల సంఖ్యలో ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గండిపేట పరీవాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. ఇదే తరహాలో హిమాయత్ సాగర్ పరిసరాల పరిధిలో వెలసిన నిర్మాణాలపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment