illegal cconstructions
-
HYDRA: నేలకొరిగిన అక్రమాలు
మణికొండ/మొయినాబాద్: గండిపేట చెరువు ఆక్రమణల చెర వీడుతోంది. ఈ చెరువుకు ఆనుకుని వెలసిన బడాబాబుల నిర్మాణాలను ఎట్టకేలకు తొలగించేందుకు హైడ్రా అధికారులు ఆదివారం శ్రీకారం చుట్టారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలసిన నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన హైడ్రా సిబ్బంది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూలి్చవేశారు. వీటిలో ఒకటి ప్రముఖ న్యాయవాదికి చెందినది కాగా.. మరొకటి కేంద్ర మాజీ మంత్రి బంధువులకు సంబంధించింది కావడం గమనార్హం. అలాగే.. శంకర్పల్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌ను నేలమట్టం చేశారు. అదే రోడ్డులో ఖానాపూర్ దాటిన తర్వాత ఉన్న ఓరో స్పోర్ట్స్ విలేజ్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య.. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో హైడ్రా ఆర్ఎఫ్ఓ పాపారావు ఆధ్వర్యంలో కూలి్చవేతలు కొనసాగాయి. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణమోహన్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్‌గౌడ్ పనులను పర్యవేక్షించారు. మొయినాబాద్ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వెస్టిసైడ్ వెంచర్లో గండిపేట చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి చేపట్టిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. మల్లికార్జున్, చరణ్, జలమండలి డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి డీకే లక్షి్మరెడ్డి, స్థానిక ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో వెస్టిసైడ్ వెంచర్‌లోని భవనాలను కూలి్చవేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన క్రికెట్ మైదానాన్ని ధ్వంసం చేశా రు. చెరువు చుట్టూ వందలాది అక్రమ నిర్మాణాలు ఉండటంతో అయిదు రోజుల పాటు కూలి్చవేతలు చేపట్టనున్నట్లు సమాచారం. చెరువును పూడ్చి.. గండిపేట చెరువును ఆనుకుని ఎకరం, రెండెకరాల భూములు కొనుగోలు చేసిన బడాబాబులు మరింత స్థలాన్ని ఆక్రమించి ఫాంహౌస్‌లు నిర్మించారు. ఖానాపూర్, గండిపేట, మంచిరేవుల, హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, చిన్నమంగళారం, జన్వా డ, మిర్జాగూడ, మియాఖాన్ గడ్డ తదితర గ్రా మాల పరిధిలో వందల సంఖ్యలో ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గండిపేట పరీవాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. ఇదే తరహాలో హిమాయత్ సాగర్ పరిసరాల పరిధిలో వెలసిన నిర్మాణాలపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్మర్ జూనియర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో(ఐదు మిలియన్ రియాస్లు) జరిమానా విధించారు. తాజాగా అక్రమ ప్రాజెక్టు కట్టడంపై నెయ్మర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కన్నెర్రజేసిన అధికారులు శనివారం రెండోసారి జరిమానా విధించి నెయ్‌మర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. కాగా 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? Neymar: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్! మిలియన్ డాలర్ ఫైన్ -
విజయవాడ : అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా
సాక్షి, విజయవాడ : విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఏసీబీ అధికారులు బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలకు సంబంధించి అనధికార అనుమతులపై లోతుగా విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు వెల్లడించారు. నిబంధనలకు విరుధ్దంగా నిర్మించిన భవననాల యజమానులపై చర్యలకు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అనిశా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ డ్యూటీనీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయని పేర్కొన్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
అక్రమ కట్టడాలు నేలమట్టం
బెంగళూరు(బనశంకరి) రాజకాలువలపై నెలకొన్న అక్రమకట్టడాలను బీబీఎంపీ అధికారులు నేలమట్టం చేశారు. సుమనహళ్లి ప్లైఓవర్ సమీపంలో వెళ్లే వృషబావతి రాజకాలువ వెడల్పు 66 అడుగులుండగా అందులో 40 అడుగులు మేర కాలువను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకుని భవనాలు, పారిశ్రామికషెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. సుమారు ఒక కిలోమీటరు పొడవు ఉన్న రాజకాలువ లో 8 షెడ్లుతో పాటు 22 కట్టడాలను నిర్మించారు. సోమవారం భారీ పోలీస్‌భద్రత మద్య పాలికె జాయింట్‌కమిషనర్ యతీశ్‌కుమార్, పాలికె ప్రధాన ఇంజనీర్ సిద్దేగౌడ నేతృత్వంలో రెండు జేసీబీ యంత్రాల సాయంతో బీబీఎంపీ సిబ్బంది అక్రమాలను నేలమట్టం చేశారు. గోవిందరాజనగర నియోజకవర్గంలోని కావేరిపుర సర్వేనెంబరు 6,7,8,9 లో 20 స్ధలాలు కబ్జాకు గురైనట్లు ఇటీవల సర్వేఅధికారులు నిర్వహించిన సర్వేలో వెలుగుచూడటంతో వాటిని కూడా తొలగించారు. ఈ సందర్భంగా పాలికె ఇంజనీర్ సిద్దేగౌడ మాట్లాడుతూ రాజకాలువలను ఆక్రమించి కట్టడాలు, భవనాలు నిర్మించిన వాటిని నిర్ధాక్షిణంగా తొలగిస్తామని ఇప్పటికే కబ్జాకు గురైన 22 ఆస్తులను నేలమట్టం చేశారు. పారిశ్రామిక షెడ్లు నిర్మించిన వారు కొద్దిరోజులు వ్యవధి అడగడంతో వారికి సమయం ఇచ్చామన్నారు. మైసూరురోడ్డు వరకు రాజకాలువపై నెలకొన్న అక్రమాలను తొలగిస్తామని సహకరించని వారిపై క్రిమినల్ కేస్ నమోదు చేయాలని బీఎంటీఫ్ పోలీసులకు సూచించామని తెలిపారు.