బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మర్ జూనియర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో(ఐదు మిలియన్ రియాస్‌లు) జరిమానా విధించారు.
తాజాగా అక్రమ ప్రాజెక్టు కట్టడంపై నెయ్‌మర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కన్నెర్రజేసిన అధికారులు శనివారం రెండోసారి జరిమానా విధించి నెయ్‌మర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. కాగా 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.
ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్‌జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది.
చదవండి: డేంజర్ జోన్‌లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా?
Neymar: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్! మిలియన్ డాలర్ ఫైన్
Comments
Please login to add a commentAdd a comment