Brazil football star
-
బ్రెజిల్‌కు బిగ్ షాక్.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్జెంటీనా
కరకస్ (వెనిజులా): బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు అర్జెంటీనా షాక్ ఇచ్చింది. రియో, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ అయిన బ్రెజిల్... ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించాలనే ఆశల్ని క్వాలిఫయింగ్ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది. దక్షిణ అమెరికా ఒలింపిక్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0తో బ్రెజిల్‌ను కంగుతినిపించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 78వ నిమిషంలో లూసినో గొండో చేసిన గోల్‌తో అర్జెంటీనా విజయం సాధించింది. తద్వారా దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు రెండో జట్టుగా అర్జెంటీనా అర్హత సంపాదించింది. ఈ గ్రూప్‌లో ఇదివరకే పరాగ్వే 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అర్హత పొందింది. బ్రెజిల్ చివరిసారిగా 20 ఏళ్ల క్రితం 2004–ఏథెన్స్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేదు. మరోవైపు అర్జెంటీనా 2004, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచింది. -
విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో నెయ్మర్ నిర్మించిన మాన్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు అతనికి భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి నెయ్మర్కు పర్యావరణ అధికారులు బిగ్‌షాక్ ఇచ్చారు. నెయ్మర్ కొత్తగా నిర్మించిన తన మాన్షన్ హౌస్ వెలుపల ఒక కృత్రిమ సరస్సును నిర్మించాడు. అతని చర్యపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పర్యావరణానికి హానీ కలిగించేలా నిబంధనలు ఉల్లఘించి మాన్షన్ బయట కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ నెయ్మర్కు 3.3 మిలియన్ యూఎస్ డాలర్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.27.1 కోట్లు) జరిమానా విధించారు. ఈ విషయాన్ని అధికారులు ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ''నిబంధనల ప్రకారం మాన్షన్‌లో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించుకోవచ్చు. కానీ నెయ్మర్ తన విలాసాల కోసం పర్యావరణానికి హానీ కలిగిస్తూ కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటి?. రూల్స్‌కు విరుద్దంగా నదీ ప్రవాహాన్ని సంగ్రహించడం చట్టరిత్యా నేరం. అనుమతి లేకుండా నదీ ప్రవాహాన్నిమళ్లించడం.. కృత్రిమ సరస్సు నిర్మాణం కోసం రాళ్లు, ఇసుకను అక్రమంగా తరలించడం.. పర్యావరణ బోర్డు అనుమతి లేకుండానే వృక్షసంపదను అణచివేయడమనేది నేరం కిందే లెక్క. ప్రభుత్వ చట్టాలను పాటించకుండా నిషేధాజ్ఞలను ఉల్లఘించినందుకు గానూ నెయ్‌మర్‌పై చర్యలు తీసుకుంటున్నాం. ''అంటూ ప్రకటనలో తెలిపింది. ఇక నెయ్మర్ కుటుంబసభ్యులు మాన్షన్‌లో ఉన్నప్పుడే అధికారులు, పోలీసులు ఎంటరయ్యారు. దీంతో నెయ్మర్ తండ్రి అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అధికారులు చుట్టూ కొలతలు తీసుకొని ఎంతమేర పర్యావరణానికి నష్టం కలిగించాడనే దానిపై రిపోర్టు తయారు చేశారు. అనంతరం నోటీసులు అంటించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. Neymar has been fined nearly $3.5 million after Brazilian authorities said that the soccer star’s luxury coastal mansion in southeastern Brazil violated rules in the 'construction of an artificial lake' https://t.co/VE5RVJYSxJ pic.twitter.com/T5rdztMMER — Reuters (@Reuters) July 5, 2023 ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చదవండి: #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్మర్ జూనియర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో(ఐదు మిలియన్ రియాస్లు) జరిమానా విధించారు. తాజాగా అక్రమ ప్రాజెక్టు కట్టడంపై నెయ్మర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కన్నెర్రజేసిన అధికారులు శనివారం రెండోసారి జరిమానా విధించి నెయ్‌మర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. కాగా 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? Neymar: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్! మిలియన్ డాలర్ ఫైన్ -
దిష్టిబొమ్మ దహనం.. ఐదు లక్షల జరిమానా; రెండేళ్ల నిషేధం
బ్రెజిల్ స్టార్, రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాలర్ వినిషియస్ జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్ లీగ్‌లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ''Go Back To Your Country'' అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ యాంటీ వయొలెన్స్ కమీషన్ సీరియస్ అయింది. లైవ్ మ్యాచ్ సమయంలో ఒక సాకర్ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. ఐదు లక్షల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. నల్లజాతీయుడైన వినిషియస్ జూనియర్ కు ఈ వివక్ష కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం బ్రెజిల్ నుంచి స్పెయిన్‌కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మధ్య మ్యాచ్‌లోనూ జూనియర్ వినిషియస్ వివక్షకు గురయ్యాడు. స్పానిష్ క్లబ్ అయిన వెలెన్సియా నినాదాలు చేసిన ముగ్గురు అభిమానులకు జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అయితే తాజాగా ఏడుగురు అభిమానులు జూనియర్ వినిషయస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను తగలబెట్టడం ఎంతో బాధించింది. Ya que los que deberían no te explican qué es y qué puede hacer @LaLiga en los casos de racismo, hemos intentado explicártelo nosotros, pero no te has presentado a ninguna de las dos fechas acordadas que tú mismo solicitaste. Antes de criticar e injuriar a @LaLiga, es necesario… https://t.co/pLCIx1b6hS pic.twitter.com/eHvdd3vJcb — Javier Tebas Medrano (@Tebasjavier) May 21, 2023 Vinicius Jr ALL GOALS AND ASSISTS so far this season, let me know if i missed anything.pic.twitter.com/QY3IMI6ygW — Druchk (@andruchk) May 28, 2023 చదవండి: వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్ -
'22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'
లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్, సీనియర్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌ను పోలీసులు గత వారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త బ్రెజిల్‌తో పాటు యావత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆటను విపరీతంగా ప్రేమించే డానీ అల్వెస్లో ఇలాంటి కోణం కూడా ఉందా అని అభిమానులు నివ్వెరపోయారు. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకు బెయిల్ ఇవ్వొద్దని స్పానిష్ కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం డానీ అల్వెస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. డానీ అల్వెస్ మాజీ భార్య డానా డినోర్హా మాత్రం అతనికి మద్దతుగా నిలబడింది. ఒక టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ''డానీ ఈ పని చేశాడంటే నేను నమ్మను. ఎందుకంటే మా ఇద్దరికి 22 ఏళ్ల పరిచయం ఉంది. 10 ఏళ్ల పాటు కలిసి జీవించాం. అతని వ్యక్తిగత జీవితం ఎలా సాగిందన్న దానిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. కచ్చితంగా తప్పు చేసి ఉండడన్న నమ్మకం నాకుంది. అయితే డానీ అల్వెస్ అరెస్ట్ నన్ను, నా పిల్లలను మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది. మాకు ఇది కష్టకాలం కావొచ్చు.. అతను నిర్దోషిగా బయటకు వస్తాడని మాత్రం చెప్పగలను. డానీ అల్వెస్ తరపు లాయర్‌ను సంప్రదించా. కేసుపై వర్క్ చేస్తున్నట్లు ఆమె చెప్పినట్లు'' తెలిపింది. డానీ అల్వెస్ అరెస్ట్ విషయానికి వస్తే.. డిసెంబర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్లబ్లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఆమె అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా కథనంగా ప్రసారం చేసింది. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డానీపై కేసు నమోదు చేశారు. అయితే అల్వెస్ మాత్రం''ఆ సమయంలో తాను ఆ క్లబ్లో కొంతమందితో కలిసి ఉన్నానని, కానీ తాను ఏ తప్పు చేయలేదని ఈ ఫుట్‌బాలర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేతప్ప ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలనని'' పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. బ్రెజిల్ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్ జట్టు తరపున 126 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేశాడు.ఇక 2022లో ఖతర్‌లో జరిగిన ఫిఫి వరల్డ్ కప్ ఆడిన బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. క్వార్టర్ ఫైనల్లో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడిన పెద్ద వయస్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన డానీ 2021-22 సీజన్లో స్పానిష్ క్లబ్‌కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్ క్లబ్ అయిన పుమాస్ యూనమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "Dani would never, ever, ever do this. Never. I'm telling you because I've known him for 22 years and I've been married to him for ten." Dana Dinorah, Dani Alves' ex-wife, has gone on television to defend the Brazilian footballer amid sexual assault allegations. pic.twitter.com/LUESGNsLya — Football España (@footballespana_) January 23, 2023 చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్‌బాలర్ ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. -
లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్‌బాలర్
లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్ అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ పోలీసులు అతడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. డానీ అల్వెస్ బెయిల్ అప్పీల్ చేసుకోగా.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదన్న స్పెయిన్ కోర్టు.. డానీ అల్వెస్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆదేశించింది. విషయంలోకి వెళితే.. డిసెంబర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్లబ్లో డానీ, సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా బట్టబయలు చేసింది. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డానీపై కేసు నమోదు చేశారు. 2022లో ఖతర్‌లో జరిగిన ఫిఫి వరల్డ్ కప్ ఆడిన బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. క్వార్టర్ ఫైనల్లో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడిన పెద్ద వయస్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు. ఇక పోలీసుల కస్టడీలో అల్వెస్ డానీ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నట్లు స్థానిక మీడియా లా వాంగార్డియా పత్రిక తమ కథనంలో పేర్కొంది.''ఆ సమయంలో తాను ఆ క్లబ్లో కొంతమందితో కలిసి ఉన్నానని, కానీ తాను ఏ తప్పు చేయలేదని ఈ ఫుట్‌బాలర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేతప్ప ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలను ?'' అని అల్వెస్ పేర్కొన్నట్లు తెలిపింది. ఇక బ్రెజిల్ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్ జట్టు తరపున 126 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేశాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన డానీ 2021-22 సీజన్లో స్పానిష్ క్లబ్‌కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్ క్లబ్ అయిన పుమాస్ యూనమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం -
రూ.342 కోట్ల ఆస్తులు జప్తు
సావోపాలో: పన్ను ఎగవేత కేసులో బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్‌కు గట్టి షాకే తగిలింది. ఈ కేసు విచారణలో భాగంగా అతడి యాట్, జెట్లతో పాటు మొత్తం 50 మిలియన్ డాలర్ల (రూ.342 కోట్లు) ఆస్తులను జప్తు చేయాల్సిందిగా సావో పాలో ఫెడరల్ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. నెయ్మార్ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాల్లో 2011 నుంచి 2013 వరకు 16 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.110 కోట్లు) పన్ను ఎగవేతకు పాల్పడినట్టు తేలింది. అయితే బకాయిపడిన మొత్తాన్ని చెల్లిస్తే నెయ్మర్ జైలుకు వెళ్లే అవకాశాలు ఉండవని బ్రెజిల్ ఫెడరల్ టాక్స్ ఏజెన్సీ ఆడిటర్ ఇయాగరో జంగ్ మార్టిన్స్ తెలిపారు.