లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్ అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ పోలీసులు అతడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. డానీ అల్వెస్ బెయిల్ అప్పీల్ చేసుకోగా.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదన్న స్పెయిన్ కోర్టు.. డానీ అల్వెస్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆదేశించింది.
విషయంలోకి వెళితే.. డిసెంబర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్లబ్‌లో డానీ, సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా బట్టబయలు చేసింది. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డానీపై కేసు నమోదు చేశారు. 2022లో ఖతర్‌లో జరిగిన ఫిఫి వరల్డ్ కప్ ఆడిన బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. క్వార్టర్ ఫైనల్లో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడిన పెద్ద వయస్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు.
ఇక పోలీసుల కస్టడీలో అల్వెస్ డానీ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నట్లు స్థానిక మీడియా లా వాంగార్డియా పత్రిక తమ కథనంలో పేర్కొంది.''ఆ సమయంలో తాను ఆ క్లబ్‌లో కొంతమందితో కలిసి ఉన్నానని, కానీ తాను ఏ తప్పు చేయలేదని ఈ ఫుట్‌బాలర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేతప్ప ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలను ?'' అని అల్వెస్ పేర్కొన్నట్లు తెలిపింది.
ఇక బ్రెజిల్ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్ జట్టు తరపున 126 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేశాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన డానీ 2021-22 సీజన్‌లో స్పానిష్ క్లబ్‌కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్ క్లబ్ అయిన పుమాస్ యూనమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
చదవండి: రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం
Comments
Please login to add a commentAdd a comment