కరకస్ (వెనిజులా): బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు అర్జెంటీనా షాక్ ఇచ్చింది. రియో, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ అయిన బ్రెజిల్... ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించాలనే ఆశల్ని క్వాలిఫయింగ్ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది. దక్షిణ అమెరికా ఒలింపిక్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0తో బ్రెజిల్‌ను కంగుతినిపించింది.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో 78వ నిమిషంలో లూసినో గొండో చేసిన గోల్‌తో అర్జెంటీనా విజయం సాధించింది. తద్వారా దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు రెండో జట్టుగా అర్జెంటీనా అర్హత సంపాదించింది. ఈ గ్రూప్‌లో ఇదివరకే పరాగ్వే 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అర్హత పొందింది. బ్రెజిల్ చివరిసారిగా 20 ఏళ్ల క్రితం 2004–ఏథెన్స్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేదు. మరోవైపు అర్జెంటీనా 2004, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment