
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్.. పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
తద్వారా పారాలింపిక్స్ చరిత్రలోనే క్లబ్ త్రో ఈవెంట్‌లో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా ధరంబీర్ నిలిచాడు. మరోవైపు ఇదే ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ రజతం కైవసం చేసుకున్నాడు.
ఫైనల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్రణవ్.. సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు సంఖ్య 24కు చేరింది. అందులో ఐదు బంగారు పతకాలు, 9 కాంస్య, 10 రజత పతకాలు ఉన్నాయి.
చదవండి: ‘టోక్యో’ను దాటేసి...