Argentina team
-
బ్రెజిల్‌కు బిగ్ షాక్.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్జెంటీనా
కరకస్ (వెనిజులా): బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు అర్జెంటీనా షాక్ ఇచ్చింది. రియో, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ అయిన బ్రెజిల్... ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించాలనే ఆశల్ని క్వాలిఫయింగ్ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది. దక్షిణ అమెరికా ఒలింపిక్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0తో బ్రెజిల్‌ను కంగుతినిపించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 78వ నిమిషంలో లూసినో గొండో చేసిన గోల్‌తో అర్జెంటీనా విజయం సాధించింది. తద్వారా దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు రెండో జట్టుగా అర్జెంటీనా అర్హత సంపాదించింది. ఈ గ్రూప్‌లో ఇదివరకే పరాగ్వే 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అర్హత పొందింది. బ్రెజిల్ చివరిసారిగా 20 ఏళ్ల క్రితం 2004–ఏథెన్స్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేదు. మరోవైపు అర్జెంటీనా 2004, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచింది. -
అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు
బ్యూనస్ ఎయిర్స్: ‘థ్యాంక్యూ చాంపియన్స్’... అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో మంగళవారం ప్రతీ రోడ్డుపై, ప్రతీ వీధిలో కనిపించిన బ్యానర్లు ఇవి. విశ్వవిజేతగా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ప్రపంచకప్ హీరోలు అక్కడి ఫ్యాన్స్ వీరాభిమానంలో తడిసి ముద్దయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానం దిగినప్పటి నుంచి రోజంతా ఆటగాళ్లు, అభిమానుల సంబరాలకు విరామం లేకుండా పోయింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్‌కప్ గెలుచుకున్న ఘనతను దేశంలో ప్రతీ ఒక్కరూ వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం ఆ దేశంలో జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. దాంతో సంబరాల ఆనందం రెట్టింపైంది. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లంతా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి మొత్తం ట్రోఫీని మెస్సీ తన చేతుల్లో ఉంచుకొని ప్రదర్శిస్తుండగా, సహచరులు నృత్యాలతో ఉత్సాహపరిచారు. భారీ సంఖ్య లో ఉన్న అభిమానుల మధ్య నుంచి ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు అధికారిక గీతంగా మారిపోయిన ముకాకోస్... ముకాకోస్ను ఆలాపిస్తూ ఫ్యాన్స్ మరింత జోష్ నింపారు. ముందుగా విమానాశ్ర యం వద్ద, ఆ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారిక కార్యాలయం వద్ద, ఆపై లక్షలాది జనం మధ్య ప్రతిష్టాత్మక ‘ఒబెలిస్క్ స్క్వేర్’ వద్ద అంబరాన్నంటేలా ఈ సంబరాలు కొనసాగాయి. చదవండి: Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
FIFA WC: మెస్సీ మాయాజాలం.. ఫైనల్‌కు అర్జెంటీనా
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022లో అర్జెంటీనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మెస్సి మాయాజాలంతో సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించి ఘనంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాతి 12.30 గంటలకు ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను మట్టికరిపించింది. ఈ క్రమంలో 2014 తర్వాత మరోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా (34.14వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత అల్వారెజ్ రెండు గోల్స్(38.51వ నిమిషంలో) గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో అల్వారెజ్ మ(69వ నిమిషాల్లో) మరో గోల్ చేశాడు. దీంతో 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Argentina storm through to the #FIFAWorldCup Final 🇦🇷 🔥 #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022 -
చాంపియన్ చిలీ
- తొలిసారి ‘కోపా అమెరికా కప్’ సొంతం - ఫైనల్లో అర్జెంటీనాపై విజయం - మెస్సీ బృందానికి మళ్లీ నిరాశ సాంటియాగో (చిలీ): ఒకటా... రెండా... ఏకంగా 99 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చిలీ జట్టు తొలిసారి ‘కోపా అమెరికా కప్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో చిలీ ‘పెనాల్టీ షూటౌట్’లో 4-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టుపై సంచలన విజయం సాధించింది. ఈ ఓటమితో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరోసారి మెగా ఈవెంట్లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది ప్రపంచకప్‌లోనూ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది. టైటిలే లక్ష్యంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన అర్జెంటీనా తుది మెట్టుపై బోల్తా పడింది. దూకుడుగా ఫైనల్‌ను ఆరంభించిన చిలీ ఆ తర్వాత జోరు తగ్గించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని నిలువరించడమే లక్ష్యంతో చిలీ ఆటతీరు సాగింది. మెస్సీ వెనుక ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను పెట్టి అతని కదలికలకు బ్రేక్ వేసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాత అదనంగా మరో అరగంట ఆడించినా ఫలితం లేకపోయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో చిలీ తరఫున వరుసగా ఫెర్నాండెజ్, విడాల్, అరాన్గుయెజ్, అలెక్సిస్ శాంచెజ్ గోల్స్ చేయగా... అర్జెంటీనాకు మెస్సీ మాత్రమే గోల్ సాధించగా.. హిగుయెన్, బనెగా విఫలమవ్వడంతో చిలీ విజయం ఖాయమైంది. హిగుయెన్ షాట్ గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లగా... బనెగా షాట్‌ను చిలీ గోల్‌కీపర్ క్లాడియో బ్రావో నిలువరించాడు. - కోపా అమెరికా కప్ చరిత్రలో అర్జెంటీనాపై చిలీకిదే తొలి విజయం. ఫైనల్‌కు ముందు గతంలో అర్జెంటీనాతో తలపడిన 24 మ్యాచ్‌ల్లో చిలీ ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మిగతా 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. - మూడో ప్రయత్నంలో చిలీ జట్టు కోపా అమెరికా కప్ విజేతగా అవతరించింది. గతంలో ఈ జట్టు 1979, 1987లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. - విజేతగా చిలీ జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 25 కోట్ల 37 లక్షలు), రన్నరప్ అర్జెంటీనాకు 30 లక్షల డాలర్లు (రూ. 19 కోట్లు), మూడో స్థానం పొందిన పెరూ జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ.12 కోట్ల 68 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన పరాగ్వేకు 10 లక్షల డాలర్లు (రూ. 6కోట్ల34లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. - ఆతిథ్య దేశం హోదాలో ‘కోపా అమెరికా కప్’ నెగ్గిన ఏడో జట్టుగా చిలీ నిలిచింది. గతంలో ఉరుగ్వే, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బొలి వియా, కొలంబియా ఈ ఘనత సాధించాయి. - వచ్చే ఏడాదితో కోపా అమెరికా కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అమెరికాలో ‘సెంటినరీ టోర్నీ’ని నిర్వహిస్తారు. 2019 కోపా అమెరికా కప్‌కు బ్రెజిల్, 2023 టోర్నీకి ఈక్వెడార్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
అర్జెంటీనా ‘టాప్’
సాంటియాగో (చిలీ): సాదాసీదా ఆటతీరు కనబరిచిన అర్జెంటీనా జట్టు రెండో విజయంతో కోపా అమెరికా కప్‌లో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. జమైకాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లతో నిండిన అర్జెంటీనా జట్టు 1-0తో శ్రమించి గెలిచింది. తన కెరీర్లో 100వ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ లియోనెల్ మెస్సీ నుంచి గోల్స్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఆట 11వ నిమిషంలో హిగుఐన్ గోల్ చేసి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత జమైకా పట్టుదలతో ఆడి అర్జెంటీనా దూకుడును నిలువరించింది. మొత్తం ఏడు పాయింట్లతో అర్జెంటీనా ‘బి’ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ఇదే గ్రూప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వే, పరాగ్వే జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాయి. 2011 టోర్నీ ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఉరుగ్వే తరఫున జిమినెజ్ (29వ నిమిషంలో), పరాగ్వే తరఫున బారియోస్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. -
అయ్యో... అర్జెంటీనా
♦ చివరి నిమిషంలో గోల్ సమర్పణ ♦ పరాగ్వేతో మ్యాచ్ ‘డ్రా’ ♦ కోపా అమెరికా కప్ లా సెరినా (చిలీ) : రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న కోపా అమెరికా కప్‌ను ఈసారి గెల్చుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టుకు తొలి మ్యాచ్ ఫలితం నిరాశను కలిగించింది. విజయంతో బోణీ చేస్తుందని భావించిన ఆ జట్టు నిర్లక్ష్య ఆటతీరుతో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున పరాగ్వేతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను అర్జెంటీనా జట్టు 2-2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. ఈ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు మ్యాచ్ చివరి నిమిషంలో గోల్ సమర్పించుకోవడం గమనార్హం. ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా విరామ సమయానికి 2-0తో ముందంజలో ఉంది. ఆట 29వ నిమిషంలో సెర్గియో అగుయెరో... 36వ నిమిషంలో లియోనెల్ మెస్సీ ఒక్కో గోల్ చేసి అర్జెంటీనాకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే రెండో అర్ధభాగంలో పరాగ్వే చక్కటి పోరాటపటిమ కనబరిచి అర్జెంటీనా దూకుడుకు కళ్లెం వేసింది. 60వ నిమిషంలో నెల్సన్ వాల్దెజ్ పరాగ్వేకు తొలి గోల్ అందించగా... 90వ నిమిషంలో లుకాస్ బారియోస్ రెండో గోల్ చేసి స్కోరును సమం చేసి అర్జెంటీనా విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. మరోవైపు ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వే 1-0తో జమైకాపై గెలిచింది. ఆట 52వ నిమిషంలో రోడ్రిగ్వెజ్ గోల్ చేసి ఉరుగ్వేను గెలిపించాడు. -
ఈసారి సాధిస్తాం
‘కోపా అమెరికా’పై మెస్సీ లా సెరినా (చిలీ): రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘కోపా అమెరికా’ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని అర్జెంటీనా జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ గురువారం చిలీలో ప్రారంభమవుతుంది. 1993లో చివరిసారి అర్జెంటీనా ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బార్సిలోనా క్లబ్ జట్టుకు మెస్సీ ఎన్నో గొప్ప విజయాలు సాధించినా జాతీయ జట్టుకు మాత్రం అదే స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. గతేడాది ప్రపంచ కప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది.