బ్యూనస్ ఎయిర్స్: ‘థ్యాంక్యూ చాంపియన్స్’... అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో మంగళవారం ప్రతీ రోడ్డుపై, ప్రతీ వీధిలో కనిపించిన బ్యానర్లు ఇవి. విశ్వవిజేతగా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ప్రపంచకప్ హీరోలు అక్కడి ఫ్యాన్స్ వీరాభిమానంలో తడిసి ముద్దయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానం దిగినప్పటి నుంచి రోజంతా ఆటగాళ్లు, అభిమానుల సంబరాలకు విరామం లేకుండా పోయింది.
36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్‌కప్ గెలుచుకున్న ఘనతను దేశంలో ప్రతీ ఒక్కరూ వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం ఆ దేశంలో జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. దాంతో సంబరాల ఆనందం రెట్టింపైంది. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లంతా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి మొత్తం ట్రోఫీని మెస్సీ తన చేతుల్లో ఉంచుకొని ప్రదర్శిస్తుండగా, సహచరులు నృత్యాలతో ఉత్సాహపరిచారు.
భారీ సంఖ్య లో ఉన్న అభిమానుల మధ్య నుంచి ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు అధికారిక గీతంగా మారిపోయిన ముకాకోస్... ముకాకోస్‌ను ఆలాపిస్తూ ఫ్యాన్స్ మరింత జోష్ నింపారు. ముందుగా విమానాశ్ర యం వద్ద, ఆ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారిక కార్యాలయం వద్ద, ఆపై లక్షలాది జనం మధ్య ప్రతిష్టాత్మక ‘ఒబెలిస్క్ స్క్వేర్’ వద్ద అంబరాన్నంటేలా ఈ సంబరాలు కొనసాగాయి.
చదవండి: Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో
Comments
Please login to add a commentAdd a comment