సాంటియాగో (చిలీ): సాదాసీదా ఆటతీరు కనబరిచిన అర్జెంటీనా జట్టు రెండో విజయంతో కోపా అమెరికా కప్‌లో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. జమైకాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లతో నిండిన అర్జెంటీనా జట్టు 1-0తో శ్రమించి గెలిచింది. తన కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ లియోనెల్ మెస్సీ నుంచి గోల్స్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఆట 11వ నిమిషంలో హిగుఐన్ గోల్ చేసి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత జమైకా పట్టుదలతో ఆడి అర్జెంటీనా దూకుడును నిలువరించింది. మొత్తం ఏడు పాయింట్లతో అర్జెంటీనా ‘బి’ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ఇదే గ్రూప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వే, పరాగ్వే జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాయి. 2011 టోర్నీ ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఉరుగ్వే తరఫున జిమినెజ్ (29వ నిమిషంలో), పరాగ్వే తరఫున బారియోస్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
అర్జెంటీనా ‘టాప్’
Published Mon, Jun 22 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM
Advertisement