ఈసారి సాధిస్తాం
‘కోపా అమెరికా’పై మెస్సీ
లా సెరినా (చిలీ): రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘కోపా అమెరికా’ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని అర్జెంటీనా జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ గురువారం చిలీలో ప్రారంభమవుతుంది. 1993లో చివరిసారి అర్జెంటీనా ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బార్సిలోనా క్లబ్ జట్టుకు మెస్సీ ఎన్నో గొప్ప విజయాలు సాధించినా జాతీయ జట్టుకు మాత్రం అదే స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. గతేడాది ప్రపంచ కప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది.