కోపా అమెరికా కప్-2024 ఛాంపియన్స్‌గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో 1-0 తేడాతో కొలంబియాను ఓడించిన అర్జెంటీనా వరుసగా రెండో సారి కోపా అమెరికా కప్ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో సంచలన గోల్‌తో అర్జెంటీనాను ఛాంపియన్స్‌గా నిలిపాడు.
కాగా ఇది అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి వరుసగా మూడో అంతర్జాతీయ ట్రోఫీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా మెస్సీకి తన కెరీర్‌లో ఇది 45వ ట్రోఫీ. ఈ క్రమంలో మెస్సీ ఓ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
వరల్డ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం డాని అల్వెస్(44) పేరిట ఉండేది. తాజా విజయంతో అల్వెస్ ఆల్‌టైమ్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. మెస్సీ కెరీర్‌లో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్, రెండు కోపా అమెరికా టైటిల్స్, ఫైనలిసిమా ట్రోఫీ, 39 క్లబ్ టైటిల్స్ ఉన్నాయి.
ఇందులో ఎక్కువ భాగం బార్సిలోనా క్లబ్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కాగా మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు.
దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి మెస్సీ వైదొలిగాడు. ఈ క్రమంలో డగౌట్‌లో మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీ మైదానంలో లేనప్పటకి తన సహచరులు మాత్రం అద్భుత విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు.
🇦🇷 Lionel Messi, most decorated player with 45 titles including one more Copa América from tonight! ✨ pic.twitter.com/SXwpgGBesh
— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024
Comments
Please login to add a commentAdd a comment