టైటిల్ పోరుకు అర్జెంటీనా | Argentina play hosts Chile in Copa America final | Sakshi
Sakshi News home page

టైటిల్ పోరుకు అర్జెంటీనా

Published Thu, Jul 2 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

టైటిల్ పోరుకు అర్జెంటీనా

టైటిల్ పోరుకు అర్జెంటీనా

సెమీస్‌లో 6-1తో పరాగ్వేపై గెలుపు    
 కోపా అమెరికా కప్

 
 కాన్సెప్సియన్ (చిలీ): వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్న లియోనల్ మెస్సీ... కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 6-1తో పరాగ్వేను చిత్తు చేసింది. టోర్నీలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆడని మెస్సీ ఈ మ్యాచ్‌లో ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. వ్యక్తిగతంగా గోల్ చేయలేకపోయినా సహచరులకు గోల్స్ చేసే అవకాశాలను సృష్టించాడు. అర్జెంటీనా తరఫున మార్కోస్ రోజో (15వ ని.), జేవియర్ ప్యాస్టోరే (27వ ని.), ఏంజెలో డి మారియా (47, 53వ ని.), సెర్గియో అగురో (80వ ని.), గోంజాలో హిగుయాన్ (83వ ని.) గోల్స్ చేశారు. లుకాస్ బారియోస్ (43వ ని.) పరాగ్వేకు ఏకైక గోల్ అందించాడు. గ్రూప్ దశలో అద్భుతంగా ఆడిన పరాగ్వే ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఎదురుదాడులను అడ్డుకోలేక చతికిలపడింది. శనివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య చిలీ జట్టుతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకుంటుంది. 2003, 2007లలో ఫైనల్‌కు చేరుకున్న అర్జెంటీనా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement