Copa America
-
కోపా కప్ విజేతగా అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ వరల్డ్ రికార్డు
కోపా అమెరికా కప్-2024 ఛాంపియన్స్‌గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో 1-0 తేడాతో కొలంబియాను ఓడించిన అర్జెంటీనా వరుసగా రెండో సారి కోపా అమెరికా కప్ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో సంచలన గోల్‌తో అర్జెంటీనాను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కాగా ఇది అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి వరుసగా మూడో అంతర్జాతీయ ట్రోఫీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా మెస్సీకి తన కెరీర్లో ఇది 45వ ట్రోఫీ. ఈ క్రమంలో మెస్సీ ఓ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం డాని అల్వెస్(44) పేరిట ఉండేది. తాజా విజయంతో అల్వెస్ ఆల్‌టైమ్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. మెస్సీ కెరీర్లో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్, రెండు కోపా అమెరికా టైటిల్స్, ఫైనలిసిమా ట్రోఫీ, 39 క్లబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం బార్సిలోనా క్లబ్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కాగా మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు.దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి మెస్సీ వైదొలిగాడు. ఈ క్రమంలో డగౌట్లో మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీ మైదానంలో లేనప్పటకి తన సహచరులు మాత్రం అద్భుత విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 🇦🇷 Lionel Messi, most decorated player with 45 titles including one more Copa América from tonight! ✨ pic.twitter.com/SXwpgGBesh— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 -
కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు ఆదనపు సమయం కేటాయించారు. ఎక్స్ట్రా సమయం కూడా ముగుస్తుండడంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షుట్ అవుట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్ కొట్టిన మార్టినెజ్.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో కొలంబియా గోల్ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.🏆🇦🇷 ARGENTINA ARE COPA AMÉRICA CHAMPIONS!Argentina have beaten Colombia 1-0 thanks to Lautaro Martínez’s goal.🏆 Copa America 2021🏆 Finalissima 2022🏆 World Cup 2022🏆 Copa America 2024Insane job by this group of players and Lionel Scaloni. 👏🏻✨ pic.twitter.com/v0GOvHv9PS— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా కప్ కావడం గమనార్హం. దీంతో అతడికి తన సహచరులు అద్భుతమైన విజయంతో విడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇప్ప్పుడు తన జట్టు విజయం సాధించడంతో మెస్సీఆనందంలో మునిగి తేలుతున్నాడు. Angel di Maria unsung hero of the match Played his last game in Argentina hersey what a player #ARGvsCOL pic.twitter.com/hnu42h3ekZ— Harshit 🇮🇳 (@krharshit771) July 15, 2024 -
#Lionel Messi: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ.. వీడియో వైరల్
Update: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్ 36వ నిమిషంలో మెస్సీ చీలమండ(పాదం)కు గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానంలో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కొంచెం కూడా ఉపశమనం లభించలేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు. మ్యాచ్ హాఫ్-టైమ్ తర్వాత కూడా స్కోర్లేకుండా పోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన కంటిన్యూ చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్ 66వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో డగౌట్లో కూర్చోన్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. మెస్సీ, మెస్సీ అంటూ జేజేలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి.ప్రస్తుతం 25 నిమిషాలు ఎక్స్ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకి ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యా. ఆఖరి 10 నిమిషాల్లో గోల్స్ రాకపోతే ఈ మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూట్ అవుట్లో తేల్చే అవకాశముంది. Messi is in tears as he is subbed off due to injury 💔 pic.twitter.com/t0l3OLLuWf— FOX Soccer (@FOXSoccer) July 15, 2024 -
28 ఏళ్ల నిరీక్షణకు తెర, కన్నీళ్లతో ఆటగాళ్లు..
అద్భుతమైన జట్టుగా పేరు.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది అర్జెంటీనా టీం. చివరకు మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన టోర్నీ అది. అలాంటిది ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. తద్వారా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు. దీంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది. #CopaAmérica 🏆 ¡ACÁ ESTÁ LA COPA! Lionel Messi 🔟🇦🇷 levantó la CONMEBOL #CopaAmérica y desató la locura de @Argentina 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/PCEX6vtVee — Copa América (@CopaAmerica) July 11, 2021 మెస్సీ-నెయ్మర్.. ఇద్దరూ కన్నీళ్లే ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. #CopaAmérica 🏆 ¡LO LINDO DEL FÚTBOL! Emotivo abrazo entre Messi 🇦🇷 y Neymar 🇧🇷 ¡ÍDOLOS! 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/ecknhlv2VI — Copa América (@CopaAmerica) July 11, 2021 తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్ టైటిల్ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది. Messi is tossed in the air by his Argentina teammates. It means everything ❤️pic.twitter.com/cIMJahlCAQ — ESPN India (@ESPNIndia) July 11, 2021 ఇక ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్ కోపాను గెల్చుకోలేకపోయింది. -
యూరో- 2016, కోపా అమెరికా
2016లో ఇప్పటి వరకు ఒలింపిక్స్‌తో పాటు యూరో-2016, కోపా అమెరికా సెంటెనరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లు కూడా జరిగాయి. వాటి వివరాలు.. యూరో ఫుట్‌బాల్ టోర్నీ యూఈఎఫ్ఏ (ద యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స) చాంపియన్‌షిప్‌ను ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నీ అంటారు. దీన్ని 1960 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఐరోపా ఫుట్‌బాల్ చాంపియన్‌ను నిర్ణయించడానికి నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 15 యూరో టోర్నమెంట్లు నిర్వహించగా జర్మనీ, స్పెయిన్లు అత్యధికంగా చెరో మూడుసార్లు టైటిల్ దక్కించుకున్నాయి. వరుసగా రెండుసార్లు యూరో టైటిల్ గెలుచుకున్న ఏకైక దేశం స్పెయిన్. వరుసగా 2008, 2012లో స్పెయిన్ ఈ టైటిల్ గెలుపొందింది. యూరో టోర్నమెంట్ విజేతకు హెన్రీ డెలానే ట్రోఫీని బహూకరిస్తారు. నాలుగు జట్లు యూరో టోర్నమెంట్లో పాల్గొన్న తొలిసారే టైటిల్‌ను సాధించాయి. అవి.. సోవియట్ యూనియన్ (1960), స్పెయిన్ (1964), ఇటలీ (1968), పశ్చిమ జర్మనీ (1972). యూరో కప్ టోర్నీలో జర్మనీ అత్యధికంగా 49 మ్యాచ్‌లు ఆడింది. దీంతోపాటు అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టు (26 సార్లు), అత్యధిక గోల్స్ చేసిన జట్టు (72 గోల్స్) వంటి రికార్డులు కూడా జర్మనీ పేరునే ఉన్నాయి. ఈ టోర్నమెంట్లలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారులు ఇద్దరు-మిషెల్ ప్లాటిని (ఫ్రాన్స), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్). వీరు చెరో తొమ్మిది గోల్స్ చేశారు. యూరో-2016 15వ యూరో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫ్రాన్‌సలో జూన్ 10 నుంచి జూలై 10 వరకు జరిగింది. ఇందులో తొలిసారిగా 24 జట్లు పాల్గొన్నాయి. ఫ్రాన్స యూరోకు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. గతంలో 1960, 1984లలో ఫ్రాన్‌సలో యూరో జరిగింది. 15వ యూరో టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటి ముఖం పట్టింది. 2016, జూలై 10న సెయింట్ డెనిస్‌లో జరిగిన ఫైనల్లో పోర్చుగల్.. ఆతిథ్య దేశమైన ఫ్రాన్‌సను 10తో ఓడించి తొలిసారి యూరోను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను పోర్చుగల్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఎడెర్ అదనపు సమయంలో చేశాడు. పోర్చుగల్‌కు ఇది తొలి అంతర్జాతీయ ఫుట్‌బాల్ టైటిల్. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా పెపె (పోర్చుగల్)ను ప్రకటించారు. ఈ విజయంతో పోర్చుగల్2017లో రష్యాలో జరిగే ఫిఫా కాన్ఫెడరేషన్స కప్‌కు అర్హత సాధించింది. యూరో- 2020 టోర్నమెంట్‌ను 13 దేశాల్లో నిర్వహిస్తారు. అవి.. అజర్బైజాన్, బెల్జియం, డెన్మార్క, ఇంగ్లండ్, జర్మనీ, హంగేరీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స, రొమేనియా, రష్యా, స్కాట్లాండ్, స్పెయిన్. ఈ టోర్నీ 2020 జూన్-జూలైలో జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రం లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరుగుతాయి. కోపా అమెరికా కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ 1916లో ప్రారంభమైంది. దీన్ని దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి ఫుట్‌బాల్ చాంపియన్‌ను నిర్ణయించేందుకు నిర్వహిస్తారు. అయితే 1990 దశకం నుంచి ఉత్తర అమెరికా, ఆసియా ఖండ దేశాలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌ను 45 సార్లు నిర్వహించగా, ఉరుగ్వే అత్యధికంగా 15 సార్లు విజేతగా నిలిచింది. అర్జెంటీనా 14 సార్లు, బ్రెజిల్ 8 సార్లు, పరాగ్వే, చిలీ, పెరూ దేశాలు రెండు సార్లు, కొలంబియా, బొలీవియాలు చెరోసారి టైటిల్ సాధించాయి. తొలి కోపా అమెరికా టోర్నమెంట్ 1916లో అర్జెంటీనాలో జరిగింది. తొలి టైటిల్‌ను ఉరుగ్వే సాధించింది. ఈ టోర్నీకి అత్యధికంగా 9 సార్లు ఆతిథ్యమిచ్చిన దేశం అర్జెంటీనా. కోపా అమెరికా సెంటెనేరియో కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2016, జూన్‌లో ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించారు. దీన్నే కోపా అమెరికా సెంటెనేరియో అంటారు. ఈ టోర్నీని 2015లో నిర్వహించినప్పటికీ, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని.. ఏడాది వ్యవధిలోనే రెండోసారి నిర్వహించారు. ఇది 45వ కోపా అమెరికా. కోపా అమెరికా సెంటెనేరియో జూన్ 3 నుంచి 26 వరకు యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. దీంతో దక్షిణ అమెరికా ఖండం వెలుపల జరిగిన తొలి కోపా అమెరికా టోర్నీగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీ 2016, జూన్ 26న అమెరికాలోని ఈస్ట్ రూథర్‌ఫర్‌డ నగరంలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగింది. ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను డిఫెండింగ్ చాంపియన్ చిలీ ఓడించి, వరుసగా రెండో కోపా అమెరికా టైటిల్‌ను (2015తో కలిపి) సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో చిలీ దేశానికి చెందిన క్లాడియో బ్రావోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయంలో కూడా ఏ జట్టూ గోల్ చేయలేదు. దాంతో పెనాల్టీలతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించారు. చిలీ 4 పెనాల్టీ గోల్స్ చేయగా, అర్జెంటీనా కేవలం 2 పెనాల్టీలనే గోల్స్‌గా మలచగలిగింది. ఈ పరాజయంతో అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్లో వరుసగా మూడోసారి అర్జెంటీనా విఫలమైంది. అర్జెంటీనా 2014 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో జర్మనీ చేతిలో, 2015 కోపా అమెరికాలో చిలీ చేతిలో ఓడిపోయింది. 45వ కోపా అమెరికాలో చిలీకి చెందిన ఎడ్వార్డో వర్గాస్ అత్యధికంగా 6 గోల్స్ చేయగా, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 5 గోల్స్, అర్జెంటీనాకు చెందిన గోంజాలో హిగ్వేన్ 3 గోల్స్ సాధించారు. అవార్డులు గోల్డెన్ బాల్ - అలెక్సిస్ సాంచెజ్ (చిలీ) గోల్డెన్ బూట్ - ఎడ్వార్డో వర్గాస్ (చిలీ) గోల్డెన్ గ్లోవ్ - క్లాడియో బ్రావో (చిలీ) ఫెయిర్ ప్లే అవార్డు - అర్జెంటీనా 46వ కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2019లో బ్రెజిల్లో జరుగుతుంది. యూరో - 2016 అవార్డులు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - ఆంటోన్ గ్రీజ్మన్ (ఫ్రాన్స) యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - రెనాటో సాంచెస్ (పోర్చుగల్) గోల్డెన్ బూట్ - ఆంటోన్ గ్రీజ్మన్ (ఫ్రాన్స - ఆరు గోల్స్) సిల్వర్ బూట్ - క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్ - 3 గోల్స్) బ్రాంజ్ బూట్ - ఒలివియర్ గిరోడ్ (ఫ్రాన్స - 3 గోల్స్) -
ప్రతీకారం తీర్చుకుంటారా!
న్యూయార్క్:శతవసంతాల కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. వందేళ్ల సుదీర్ఘ చరిత్రలో భాగంగా ఈ ఏడాది నిర్వహించిన కోపా అమెరికా కప్ రేపటితో ముగియనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అర్జెంటీనా-చిలీ జట్లు జరిగే తుది పోరులో తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నాయి. భారత కాలమానప్రకారం సోమవారం ఉదయం గం.5.30 ని.లకు ఈస్ట్ రూథర్ఫర్డ్లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీఫైనల్లో కొలంబియాపై 2-0తో విజయం సాధించి చిలీ ఫైనల్ కు చేరగా, అర్జెంటీనా 4-0 తేడాతో అమెరికాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైంది. గతేడాది ఇదే టోర్నీలో ఈ రెండు జట్లే ఫైనల్ కు చేరగా చిలీ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి కోపా అమెరికా కప్ ను అందుకుంది. అయితే మరోసారి టైటిల్ ను సాధించాలని చిలీ పట్టుదలగా ఉంది. ఫైనల్ కు చేరే క్రమంలో మేటి జట్లను సైతం మట్టికరిపించి ఫైనల్ కు చేరిన చిలీ మరో అడుగును దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, గతేడాది ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా భావిస్తోంది. ఇప్పటివరకూ 14 సార్లు కోపా అమెరికా ట్రోఫీని అందుకున్న అర్జెంటీనా.. ఈసారి కోప్ కప్ ను గెలుచుకుని 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించడానికి సమాయత్తమవుతోంది. 1921లో తొలి టైటిల్ ను అందుకున్న అర్జెంటీనా.. 1993 లో చివరిసారి కోపా టైటిల్ ను సాధించింది. అయితే గత కొంతకాలంగా ప్రధాన టోర్నీల్లో మెస్సీ అండ్ గ్యాంగ్ చతికిలబడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. 2014లో వరల్డ్ కప్ ఫైనల్లో జర్మనీ చేతిలో పరాజయం చెందిన అర్జెంటీనా.. 2015 కోపా అమెరికా కప్ లో కూడా ఫైనల్ ఫోబియోను అధిగమించలేకపోయింది. మరోవైపు అర్జెంటీనా జట్టు నాయకత్వంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. అర్జెంటీనా జట్టులో పోస్టర్ తరహా పాత్రను పోషిస్తూ ఫీల్డ్‌లో ఒక గొప్ప నాయకుడిగా మెస్సీ మన్ననలు అందుకుంటున్నాడంటూ మారడోనా మండిపడ్డాడు.. అతను తన క్యారెక్టర్‌ను కోల్పోయి జట్టుకు నాయకుడిగా మారాడని ధ్వజమెత్తాడు. అయితే అర్జెంటీనా ఫైనల్ కు చేరినా మారడోనా మాత్రం మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆదివారం నాటి పోరులో అర్జెంటీనా విజేతగా నిలిచి పరువు నిలుపుకోవాలన్నాడు. ఒకవేళ విజయం సాధించని పక్షంలో ఇప్పుడు వరకూ సాధించింది ఏమీ ఉండదంటూ మెస్సీ సేనకు హితబోధ చేశాడు. ఈ నేపథ్యంలో విజయంతోనే ఇంటా, బయటా సమాధానం చెప్పడానికి ఆ జట్టు సిద్ధమవుతోంది. దీంతో సుమారు ఎనభైవేల మంది ప్రేక్షక్షుల హాజరయ్యే తుది సమరం ఆసక్తికరంగా సాగి అవకాశం ఉంది. -
సెమీస్ కు కొలంబియా
న్యూజెర్సీ: కోపా అమెరికా ఫుట్ బాల్ కప్‌లో కొలంబియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కొలంబియా 4-2 తేడాతో పెరూపై గెలిచి సెమీస్ కు చేరింది. మ్యాచ్ నిర్ణీత సమయానికి(90 నిమిషాలు) ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇంజ్యూరీ టైమ్ లో కొలంబియా దుమ్మురేపింది. నాలుగు పెనాల్టీ షూటౌట్లను గోల్ గా మలచి విజయం కైవసం చేసుకుంది. మరోవైపు రెండు గోల్స్ మాత్రమే చేసిన పెరూ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తన తదుపరి సెమీస్ మ్యాచ్ లో కొలంబియా.. రేపు జరిగే మెక్సికో-చిలీ విజేతతో తలపడతుంది. -
టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది!
పసడెనా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి ఇక్కడ కొలంబియా-పరాగ్వే మ్యాచ్ సందర్భంగా తొలుత వేసిన టాస్ కాస్తా ఎడ్జ్(వోర)గా పడటం ఆసక్తికరంగా మారింది. టాస్ లో భాగంగా కొలంబియా-పరాగ్వే కెప్టెన్లతో పాటు, నలుగురు అధికారులు ఫీల్డ్‌లోకి వచ్చారు. అనంతరం గాల్లో ఎగురువేసిన కాయిన్ గడ్డిలో నిటారుగా నిలబడి పోయింది. దాంతో ఇరు జట్ల కెప్టెన్లు, అధికారులు నవ్వుకుంటూ మరోసారి ఆ కాయిన్ తీసుకుని టాస్ వేశారు. ఇలా ముందుగా టాస్ వేసిన కాయిన్ ఎడ్జ్ గా పడటంతో ఆ మ్యాచ్‌కు ఆరంభానికి కాస్త ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో కొలంబియా 2-1 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. కొలంబియా తరఫున కార్లోస్ బాకా, జేమ్స్ రోడ్రిగ్వేజ్ తలో గోల్స్ చేసి విజయంలో సహకరించారు.ఆపై పరాగ్వే 71వ నిమిషంలో గోల్ మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. -
మెస్సీ కుటుంబంపై చిలీ అభిమానుల దాడి
శాండియాగో: అభిమానం అదుపుతప్పింది. క్రీడాస్ఫూర్తి మంటకలిసింది. ఇరు జట్ల అభిమానులు పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆటగాళ్లకు చెందిన కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. ఇదీ.. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా శాండియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియంలో చోటుచేసుకున్న పరిస్థితి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లూ అద్భుతంగా ఆడటంతో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. చివరికి షూట్ అవుట్ ద్వారా ఆతిథ్య చిలీ జట్టు 4-1 తేడాతో విజేతగా నిలిచిందిది. కాగా, ఫస్ట్‌హాఫ్ విరామంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ కుటుంబసభ్యులను ఉద్దేశించి కొందరు చిలీ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోపోద్రిక్తుడైన మెస్సీ సోదరుడు రొడ్రిగో ఘాటుగా ప్రతిస్పందించాడు. దీంతో ఇరు బృందాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఒక దశలో మెస్సీ కుటుంబసభ్యులను చిలీ అభిమానులు తోసివేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు మెస్సీ సోదరుణ్ని టీవీ క్యాబిన్‌కు తరలించారు. మిగతా మ్యాచ్ ను అక్కడినుంచే వీక్షించాలని, గ్యాలరీలోకి వెళ్లొద్దని రొడ్రిగోను పోలీసులు అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిసింది. -
'కోపా' కప్ విజేత చిలీ
శాండియాగో: 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ- 2015లో చిలీ విజేతగా నిలిచింది. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో షూట్ అవుటే శరణ్యమైంది. చిలీ గోల్ కీపర్ క్లౌడియో బ్రావో సమయ స్పూర్తితో ఒక గోల్ తప్పించడం, అర్జెంటీనా ఆటగాళ్లుకూడా బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో రెండు దఫాలు విఫలం కావడంతో 4-1 తేడాతో చిలీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఫైనల్స్ లో దురదృష్టం మెస్సీ సేన వెన్నంటే ఉంటుందని రుజువైంది. గత ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లోనూ ఫైనల్స్ వరకు వెళ్లిన మెస్సీ సేన జర్మనీ చేతిలో 1-0 తేడాతో పరాజయంపాలైన సంగతి తెలిసిందే. -
టైటిల్ పోరుకు అర్జెంటీనా
సెమీస్‌లో 6-1తో పరాగ్వేపై గెలుపు కోపా అమెరికా కప్ కాన్సెప్సియన్ (చిలీ): వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్న లియోనల్ మెస్సీ... కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 6-1తో పరాగ్వేను చిత్తు చేసింది. టోర్నీలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆడని మెస్సీ ఈ మ్యాచ్‌లో ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. వ్యక్తిగతంగా గోల్ చేయలేకపోయినా సహచరులకు గోల్స్ చేసే అవకాశాలను సృష్టించాడు. అర్జెంటీనా తరఫున మార్కోస్ రోజో (15వ ని.), జేవియర్ ప్యాస్టోరే (27వ ని.), ఏంజెలో డి మారియా (47, 53వ ని.), సెర్గియో అగురో (80వ ని.), గోంజాలో హిగుయాన్ (83వ ని.) గోల్స్ చేశారు. లుకాస్ బారియోస్ (43వ ని.) పరాగ్వేకు ఏకైక గోల్ అందించాడు. గ్రూప్ దశలో అద్భుతంగా ఆడిన పరాగ్వే ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఎదురుదాడులను అడ్డుకోలేక చతికిలపడింది. శనివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య చిలీ జట్టుతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకుంటుంది. 2003, 2007లలో ఫైనల్‌కు చేరుకున్న అర్జెంటీనా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. -
కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ
-
కోపా అమెరికా కప్ 2015
-
అర్జెంటీనా వర్సెస్ చిలీ
కొన్సెప్స్జన్ (చిలీ): చారిత్రక కోపా అమెరికా- 2015 ఫుట్‌బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) కొన్సెప్స్జన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో పరాగ్వేను 1- 6 గోల్స్ తేడాతో మట్టికరిపించిన అర్జెంటీనా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మొదటి సెమీస్‌లో చిలీ 2- 1 తేడాతో పెరూపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ట్రోఫీ కోసం అర్జెంటీనా, చిలీల మధ్య జరిగే ఫైనల్స్‌కు శాంటియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియం వేదికకానుంది. శనివారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తుది సమయం ప్రారంభంకానుంది. చివరిసారిగా 1993లో కోపా అమెరికా విజేతగా నిలిచిన అర్జెంటీనాకు ఆ టోర్నీల్లో ఇది 14వ ఫైనల్స్ కాగా ఆతిధ్య చిలీ 28 ఏళ్ల తర్వాత ఫైనల్స్‌కు చేరింది. -
కోపాకు దూరం కానున్న నెయ్మర్!
సాంటియాగో: బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ నెయ్మర్ తన దుందుడుకు ప్రవర్తనతో కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం సమావేశమైన కోపా అమెరికా క్రమశిక్షణ బోర్డు నెయ్‌మర్‌పై రెండు మ్యాచ్‌ల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే కచ్చితమైన నిషేధం ఎంతకాలం వరకు అనేది బోర్డు మరో సమావేశంలో తేల్చనుంది. వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ ఆటగాడు ఎల్లో కార్డులను ఎదుర్కొన్నాడు. గురువారం కొలంబియాతో జరిగిన మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగడంతో రిఫరీ రెడ్ కార్డు చూపిన విషయం తెలిసిందే. -
ఈసారి సాధిస్తాం
‘కోపా అమెరికా’పై మెస్సీ లా సెరినా (చిలీ): రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘కోపా అమెరికా’ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని అర్జెంటీనా జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ గురువారం చిలీలో ప్రారంభమవుతుంది. 1993లో చివరిసారి అర్జెంటీనా ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బార్సిలోనా క్లబ్ జట్టుకు మెస్సీ ఎన్నో గొప్ప విజయాలు సాధించినా జాతీయ జట్టుకు మాత్రం అదే స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. గతేడాది ప్రపంచ కప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది.