సెమీస్ కు కొలంబియా | Copa America, Colombia Overcome Peru in Penalty Shoot-Out to Reach Semis | Sakshi
Sakshi News home page

సెమీస్ కు కొలంబియా

Jun 18 2016 5:28 PM | Updated on Sep 4 2017 2:49 AM

కోపా అమెరికా ఫుట్ బాల్ కప్లో కొలంబియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.

న్యూజెర్సీ: కోపా అమెరికా ఫుట్ బాల్ కప్లో కొలంబియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం ఉదయం జరిగిన  క్వార్టర్ ఫైనల్లో కొలంబియా 4-2 తేడాతో పెరూపై గెలిచి సెమీస్ కు చేరింది. మ్యాచ్ నిర్ణీత సమయానికి(90 నిమిషాలు) ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇంజ్యూరీ టైమ్ లో కొలంబియా దుమ్మురేపింది.

 

నాలుగు పెనాల్టీ షూటౌట్లను గోల్ గా మలచి విజయం కైవసం చేసుకుంది. మరోవైపు  రెండు గోల్స్ మాత్రమే చేసిన పెరూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.  తన తదుపరి సెమీస్ మ్యాచ్ లో కొలంబియా.. రేపు జరిగే మెక్సికో-చిలీ విజేతతో తలపడతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement