టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది! | Copa America Match Delayed After Toss Coin Lands on Its Edge | Sakshi
Sakshi News home page

టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది!

Published Thu, Jun 9 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది!

టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది!

పసడెనా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి ఇక్కడ కొలంబియా-పరాగ్వే మ్యాచ్ సందర్భంగా తొలుత వేసిన టాస్ కాస్తా ఎడ్జ్(వోర)గా పడటం ఆసక్తికరంగా మారింది.  టాస్ లో భాగంగా కొలంబియా-పరాగ్వే కెప్టెన్లతో పాటు, నలుగురు అధికారులు ఫీల్డ్లోకి వచ్చారు. అనంతరం గాల్లో ఎగురువేసిన కాయిన్ గడ్డిలో నిటారుగా నిలబడి పోయింది. దాంతో ఇరు జట్ల కెప్టెన్లు, అధికారులు నవ్వుకుంటూ మరోసారి ఆ కాయిన్ తీసుకుని టాస్ వేశారు. ఇలా ముందుగా టాస్ వేసిన కాయిన్ ఎడ్జ్ గా పడటంతో ఆ మ్యాచ్కు ఆరంభానికి కాస్త ఆలస్యమైంది.

ఈ మ్యాచ్లో కొలంబియా 2-1 తేడాతో గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. కొలంబియా తరఫున కార్లోస్ బాకా, జేమ్స్ రోడ్రిగ్వేజ్ తలో గోల్స్ చేసి విజయంలో సహకరించారు.ఆపై పరాగ్వే 71వ నిమిషంలో గోల్ మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement