Paraguay
-
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
భారత జట్ల విజయం
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్ ఐదో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు 3.5–0.5తో పరాగ్వేపై... మహిళల జట్టు 3.5–0.5తో అర్జెంటీనాపై గెలుపొందాయి. విశ్వనాథన్ ఆనంద్ 26 ఎత్తుల్లో రమిరెజ్ డెల్గాడోపై... ఆధిబన్ 35 ఎత్తుల్లో అల్మిరాన్‌పై... శశికిరణ్ 35 ఎత్తుల్లో వెర్జివ్‌కర్‌పై నెగ్గగా; గిలెర్మోతో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 52 ఎత్తుల్లో కరోలినా లుజాన్‌పై... తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో ఫ్లోరెన్సియాపై... ఇషా కరవాడే 35 ఎత్తుల్లో ఐలెన్‌పై విజయం సాధించగా... క్లాడియా అమూరాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
పరాగ్వేలో భారీ దొంగతనం
-
క్వార్టర్స్‌లో అమెరికా, కొలంబియా
కోపా అమెరికా కప్ ఫిలడెల్ఫియా: టోర్నమెంట్లో ముందుకు సాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అమెరికా ఫుట్‌బాల్ జట్టు సత్తా చాటింది. పటిష్టమైన డిఫెన్స్‌కు తోడు ఫార్వర్డ్స్ సమయోచిత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో కోపా అమెరికా కప్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో అమెరికా 1-0తో పరాగ్వేపై విజయం సాధించింది. క్లింట్ డెంప్సే (27వ ని.) యూఎస్ తరఫున ఏకైక గోల్ సాధించాడు. తొలి మ్యాచ్‌లో కొలంబియా చేతిలో ఓడినా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిన అమెరికా గ్రూప్ టాపర్‌గా ఆరు పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు 2001 తర్వాత పరాగ్వే గ్రూప్ దశలో వైదొలగడం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగా లైనప్‌లో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగిన అమెరికాకు సెంటర్ మిడ్‌ఫీల్డ్‌లో మైకేల్ బ్రాడ్లీ, జోన్స్‌లు అడ్డుగోడలా నిలిచారు. వీళ్ల అండతో ఫార్వర్డ్స్... పరాగ్వేపై దూకుడుగా దాడి చేశారు. అయితే 6వ నిమిషంలో ఫ్యాబిన్ జాన్సన్ (అమెరికా) కొట్టిన కర్లింగ్ ఫ్రీ కిక్ క్రాస్‌బార్ పైనుంచి వెళ్లడంతో తేరుకున్న పరాగ్వే ఒక్కసారిగా కౌంటర్ అటాక్‌కు దిగింది. కానీ 27వ నిమిషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి జార్డెస్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను డెంప్సే నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపి అమెరికాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న కొలంబియా... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం బోల్తా కొట్టింది. కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 2-3తో ఓడిపోయింది. -
టాస్ వేయబోతే ఎడ్జ్ అయ్యింది!
పసడెనా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి ఇక్కడ కొలంబియా-పరాగ్వే మ్యాచ్ సందర్భంగా తొలుత వేసిన టాస్ కాస్తా ఎడ్జ్(వోర)గా పడటం ఆసక్తికరంగా మారింది. టాస్ లో భాగంగా కొలంబియా-పరాగ్వే కెప్టెన్లతో పాటు, నలుగురు అధికారులు ఫీల్డ్‌లోకి వచ్చారు. అనంతరం గాల్లో ఎగురువేసిన కాయిన్ గడ్డిలో నిటారుగా నిలబడి పోయింది. దాంతో ఇరు జట్ల కెప్టెన్లు, అధికారులు నవ్వుకుంటూ మరోసారి ఆ కాయిన్ తీసుకుని టాస్ వేశారు. ఇలా ముందుగా టాస్ వేసిన కాయిన్ ఎడ్జ్ గా పడటంతో ఆ మ్యాచ్‌కు ఆరంభానికి కాస్త ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో కొలంబియా 2-1 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. కొలంబియా తరఫున కార్లోస్ బాకా, జేమ్స్ రోడ్రిగ్వేజ్ తలో గోల్స్ చేసి విజయంలో సహకరించారు.ఆపై పరాగ్వే 71వ నిమిషంలో గోల్ మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.