అర్జెంటీనా వర్సెస్ చిలీ | Argentina and Chile are in Copa America finals | Sakshi
Sakshi News home page

అర్జెంటీనా వర్సెస్ చిలీ

Published Wed, Jul 1 2015 10:27 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

అర్జెంటీనా వర్సెస్ చిలీ

అర్జెంటీనా వర్సెస్ చిలీ

కొన్సెప్స్జన్ (చిలీ): చారిత్రక కోపా అమెరికా- 2015 ఫుట్బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) కొన్సెప్స్జన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్స్లో పరాగ్వేను 1- 6 గోల్స్ తేడాతో మట్టికరిపించిన అర్జెంటీనా ఫైనల్స్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మొదటి సెమీస్లో చిలీ 2- 1 తేడాతో పెరూపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ట్రోఫీ కోసం అర్జెంటీనా, చిలీల మధ్య జరిగే ఫైనల్స్కు శాంటియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియం వేదికకానుంది. శనివారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తుది సమయం ప్రారంభంకానుంది. చివరిసారిగా 1993లో కోపా అమెరికా విజేతగా నిలిచిన అర్జెంటీనాకు ఆ టోర్నీల్లో ఇది 14వ ఫైనల్స్ కాగా ఆతిధ్య చిలీ 28 ఏళ్ల తర్వాత ఫైనల్స్కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement