యూరో- 2016, కోపా అమెరికా | Euro 2016 Copa America | Sakshi
Sakshi News home page

యూరో- 2016, కోపా అమెరికా

Published Sun, Oct 2 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

యూరో- 2016, కోపా అమెరికా

యూరో- 2016, కోపా అమెరికా

 2016లో ఇప్పటి వరకు ఒలింపిక్స్‌తో పాటు  యూరో-2016, కోపా అమెరికా సెంటెనరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లు కూడా జరిగాయి. వాటి వివరాలు..
 

 యూరో ఫుట్‌బాల్ టోర్నీ
 యూఈఎఫ్‌ఏ (ద యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌‌స) చాంపియన్‌షిప్‌ను ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నీ అంటారు. దీన్ని 1960 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఐరోపా ఫుట్‌బాల్ చాంపియన్‌ను నిర్ణయించడానికి నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 15 యూరో టోర్నమెంట్లు నిర్వహించగా జర్మనీ, స్పెయిన్‌లు అత్యధికంగా చెరో మూడుసార్లు  టైటిల్ దక్కించుకున్నాయి. వరుసగా రెండుసార్లు యూరో టైటిల్ గెలుచుకున్న ఏకైక దేశం స్పెయిన్. వరుసగా 2008, 2012లో స్పెయిన్ ఈ టైటిల్ గెలుపొందింది. యూరో టోర్నమెంట్ విజేతకు హెన్రీ డెలానే ట్రోఫీని బహూకరిస్తారు.
 
 నాలుగు జట్లు యూరో టోర్నమెంట్లో పాల్గొన్న తొలిసారే టైటిల్‌ను సాధించాయి. అవి.. సోవియట్ యూనియన్ (1960), స్పెయిన్ (1964), ఇటలీ (1968), పశ్చిమ జర్మనీ (1972). యూరో కప్ టోర్నీలో జర్మనీ అత్యధికంగా 49 మ్యాచ్‌లు ఆడింది. దీంతోపాటు అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టు (26 సార్లు), అత్యధిక గోల్స్ చేసిన జట్టు (72 గోల్స్)  వంటి రికార్డులు కూడా జర్మనీ పేరునే ఉన్నాయి. ఈ టోర్నమెంట్లలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారులు ఇద్దరు-మిషెల్ ప్లాటిని (ఫ్రాన్‌‌స), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్). వీరు చెరో తొమ్మిది గోల్స్ చేశారు.
 
 యూరో-2016
  15వ యూరో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫ్రాన్‌‌సలో జూన్ 10 నుంచి జూలై 10 వరకు జరిగింది. ఇందులో తొలిసారిగా 24 జట్లు పాల్గొన్నాయి. ఫ్రాన్‌‌స యూరోకు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. గతంలో 1960, 1984లలో ఫ్రాన్‌‌సలో యూరో జరిగింది.
 
  15వ యూరో టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటి ముఖం పట్టింది. 2016, జూలై 10న సెయింట్ డెనిస్‌లో జరిగిన ఫైనల్లో పోర్చుగల్.. ఆతిథ్య దేశమైన ఫ్రాన్‌‌సను 10తో ఓడించి తొలిసారి యూరోను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను పోర్చుగల్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఎడెర్ అదనపు సమయంలో చేశాడు. పోర్చుగల్‌కు ఇది తొలి అంతర్జాతీయ ఫుట్‌బాల్ టైటిల్. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా పెపె (పోర్చుగల్)ను ప్రకటించారు.
 
  ఈ విజయంతో పోర్చుగల్2017లో రష్యాలో జరిగే ఫిఫా కాన్ఫెడరేషన్‌‌స కప్‌కు అర్హత సాధించింది.
 యూరో- 2020 టోర్నమెంట్‌ను 13 దేశాల్లో నిర్వహిస్తారు. అవి.. అజర్‌బైజాన్, బెల్జియం, డెన్మార్‌‌క, ఇంగ్లండ్, జర్మనీ, హంగేరీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్‌‌స, రొమేనియా, రష్యా, స్కాట్లాండ్, స్పెయిన్. ఈ టోర్నీ 2020 జూన్-జూలైలో జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రం లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరుగుతాయి.
 
 కోపా అమెరికా
 కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ 1916లో ప్రారంభమైంది. దీన్ని దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి ఫుట్‌బాల్ చాంపియన్‌ను నిర్ణయించేందుకు నిర్వహిస్తారు. అయితే 1990 దశకం నుంచి ఉత్తర అమెరికా, ఆసియా ఖండ దేశాలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌ను 45 సార్లు నిర్వహించగా, ఉరుగ్వే అత్యధికంగా 15 సార్లు విజేతగా నిలిచింది. అర్జెంటీనా 14 సార్లు, బ్రెజిల్ 8 సార్లు, పరాగ్వే, చిలీ, పెరూ దేశాలు రెండు సార్లు, కొలంబియా, బొలీవియాలు చెరోసారి టైటిల్ సాధించాయి. తొలి కోపా అమెరికా టోర్నమెంట్ 1916లో అర్జెంటీనాలో జరిగింది. తొలి టైటిల్‌ను ఉరుగ్వే సాధించింది. ఈ టోర్నీకి అత్యధికంగా 9 సార్లు ఆతిథ్యమిచ్చిన దేశం అర్జెంటీనా.
 
 కోపా అమెరికా సెంటెనేరియో
  కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2016, జూన్‌లో ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించారు. దీన్నే కోపా అమెరికా సెంటెనేరియో అంటారు. ఈ టోర్నీని 2015లో నిర్వహించినప్పటికీ, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని.. ఏడాది వ్యవధిలోనే రెండోసారి నిర్వహించారు. ఇది 45వ కోపా అమెరికా.
 
  కోపా అమెరికా సెంటెనేరియో జూన్ 3 నుంచి 26 వరకు యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. దీంతో దక్షిణ అమెరికా ఖండం వెలుపల జరిగిన తొలి కోపా అమెరికా టోర్నీగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీ 2016, జూన్ 26న అమెరికాలోని ఈస్ట్ రూథర్‌ఫర్‌‌డ నగరంలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగింది.
 
  ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను డిఫెండింగ్ చాంపియన్ చిలీ ఓడించి, వరుసగా రెండో కోపా అమెరికా టైటిల్‌ను (2015తో కలిపి) సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో చిలీ దేశానికి చెందిన క్లాడియో బ్రావోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయంలో కూడా ఏ జట్టూ గోల్ చేయలేదు. దాంతో పెనాల్టీలతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించారు.
 
  చిలీ 4 పెనాల్టీ గోల్స్ చేయగా, అర్జెంటీనా కేవలం 2 పెనాల్టీలనే గోల్స్‌గా మలచగలిగింది. ఈ పరాజయంతో అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్లో వరుసగా మూడోసారి అర్జెంటీనా విఫలమైంది. అర్జెంటీనా 2014 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో జర్మనీ చేతిలో, 2015 కోపా అమెరికాలో చిలీ చేతిలో ఓడిపోయింది. 45వ కోపా అమెరికాలో చిలీకి చెందిన ఎడ్వార్డో వర్గాస్ అత్యధికంగా 6 గోల్స్ చేయగా, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 5 గోల్స్, అర్జెంటీనాకు చెందిన గోంజాలో హిగ్వేన్ 3 గోల్స్ సాధించారు.
 
 అవార్డులు
 గోల్డెన్ బాల్  - అలెక్సిస్ సాంచెజ్ (చిలీ)
 గోల్డెన్ బూట్ - ఎడ్వార్డో వర్గాస్ (చిలీ)
 గోల్డెన్ గ్లోవ్  - క్లాడియో బ్రావో (చిలీ)
 ఫెయిర్ ప్లే అవార్డు - అర్జెంటీనా
 46వ కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2019లో బ్రెజిల్‌లో జరుగుతుంది.
 
 యూరో - 2016 అవార్డులు
 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
 - ఆంటోన్ గ్రీజ్‌మన్ (ఫ్రాన్‌‌స)
 యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
 - రెనాటో సాంచెస్ (పోర్చుగల్)
 గోల్డెన్ బూట్
 - ఆంటోన్ గ్రీజ్‌మన్ (ఫ్రాన్‌‌స - ఆరు గోల్స్)
 సిల్వర్ బూట్
 - క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్ - 3 గోల్స్)
 బ్రాంజ్ బూట్
 - ఒలివియర్ గిరోడ్ (ఫ్రాన్‌‌స - 3 గోల్స్)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement