![కోపాకు దూరం కానున్న నెయ్‌మర్!](/styles/webp/s3/article_images/2017/09/3/61434746090_625x300.jpg.webp?itok=pQ__vmGS)
కోపాకు దూరం కానున్న నెయ్‌మర్!
సాంటియాగో: బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ నెయ్‌మర్ తన దుందుడుకు ప్రవర్తనతో కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం సమావేశమైన కోపా అమెరికా క్రమశిక్షణ బోర్డు నెయ్‌మర్‌పై రెండు మ్యాచ్‌ల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే కచ్చితమైన నిషేధం ఎంతకాలం వరకు అనేది బోర్డు మరో సమావేశంలో తేల్చనుంది. వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ ఆటగాడు ఎల్లో కార్డులను ఎదుర్కొన్నాడు. గురువారం కొలంబియాతో జరిగిన మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగడంతో రిఫరీ రెడ్ కార్డు చూపిన విషయం తెలిసిందే.