Football title
-
Intercontinental Cup 2024: సిరియాతో నేడు భారత్ పోరు... గెలిస్తేనే టీమిండియాకు టైటిల్
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టైటిల్ కోసం నేడు భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సిరియా జట్టుతో భారత్ తలపడనుంది. మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మారిషస్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 0–0తో ‘డ్రా’ చేసుకోగా... సిరియా జట్టు 2–0తో మారిషస్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు భారత్‌తో జరిగే మ్యాచ్‌ను సిరియా ‘డ్రా’ చేసుకుంటే చాలు టైటిల్‌ను దక్కించుకుంటుంది. భారత జట్టుకు టైటిల్ లభించాలంటే సిరియాపై గెలవాలి. ఇప్పటి వరకు భారత్, సిరియా జట్లు ముఖాముఖిగా ఏడుసార్లు తలపడ్డాయి. 3 మ్యాచ్‌ల్లో సిరియా, 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో సిరియా 93వ స్థానంలో, భారత్ 124వ స్థానంలో ఉన్నాయి. నేడు రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్18–3 టీవీ చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
యూరో కప్ విజేతకు ఘన స్వాగతం.. మాడ్రిడ్ దద్దరిల్లిపోయింది! వీడియో
యూరో కప్-2024 విజేత స్పెయిన్‌కు ఆపూర్వ స్వాగతం లభించింది. ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న స్పెయిన్ జట్టుకు అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తమ సొంత గడ్డపై అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు.. తొలుత ఆ దేశ రాజు ఫెలిపే VI, అతని కుటుంబాన్ని కలిశారు.ఆ తర్వాత రాజధాని మాడ్రిడ్‌లో ఓపెన్-టాప్ బస్ పరేడ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు పాల్గోనున్నారు. తమ ఆరాధ్య జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మాడ్రిడ్‌లోని సిబిలెస్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు.అభిమానుల కేరింతల మధ్య స్పెయిన్ జట్టు బస్ విక్టరీ పరేడ్ జరిగింది. స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీతో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్ యూరోకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🎉🇪🇦 ¡Ojo al ambientazo en Cibeles para recibir a los #C4MPEONES de la #EURO2024!📹 @ernestoasc_ pic.twitter.com/piTQDDiqKm— MARCA (@marca) July 15, 2024 -
యూరోప్ కింగ్స్
ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్ లీగ్’ ఫుట్‌బాల్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ క్లబ్ 11వ సారి సొంతం చేసుకుంది. ఇటలీలోని మిలాన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-3తో అట్లెటికో మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 111 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించింది. యూరోప్ దేశాల్లోని ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య ఈ లీగ్ జరుగుతుంది. -
ఈసారి సాధిస్తాం
‘కోపా అమెరికా’పై మెస్సీ లా సెరినా (చిలీ): రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘కోపా అమెరికా’ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని అర్జెంటీనా జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ గురువారం చిలీలో ప్రారంభమవుతుంది. 1993లో చివరిసారి అర్జెంటీనా ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బార్సిలోనా క్లబ్ జట్టుకు మెస్సీ ఎన్నో గొప్ప విజయాలు సాధించినా జాతీయ జట్టుకు మాత్రం అదే స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. గతేడాది ప్రపంచ కప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది.