
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022లో అర్జెంటీనా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మెస్సి మాయాజాలంతో సెమీఫైనల్‌లో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించి ఘనంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాతి 12.30 గంటలకు ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను మట్టికరిపించింది. ఈ క్రమంలో 2014 తర్వాత మరోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా (34.14వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత అల్వారెజ్ రెండు గోల్స్(38.51వ నిమిషంలో) గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో అల్వారెజ్ మ(69వ నిమిషాల్లో) మరో గోల్ చేశాడు. దీంతో 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా.
Argentina storm through to the #FIFAWorldCup Final 🇦🇷 🔥 #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
Comments
Please login to add a commentAdd a comment