ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా జట్టు ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఎలాగైనా టైటిల్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుంది. కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీ సేన తమ కలను సాకారం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
అర్జెంటీనా తరపున మెస్సీ( ఆట 34వ నిమిషం), జులియన్ అల్వరేజ్(ఆట 39, 69వ నిమిషంలో) గోల్స్ చేశారు. కీలకమైన సెమీఫైనల్లో ఈ ఇద్దరు మంచి ఫైర్‌తో ఆడారు. అయితే అల్వరేజ్ గోల్స్ చేయడం వెనుక మెస్సీ పరోక్షంగా సహాయపడ్డాడు. మెస్సీ ఇచ్చిన పాస్‌లను గోల్ మలిచి అల్వరేజ్ సక్సెస్ కావడమే గాక జట్టును విజయం దిశగా నడిపించాడు.
అయితే తాజాగా ట్విటర్‌లో మెస్సీతో అల్వరేజ్ దిగిన ఒక ఫోటో వైరల్‌గా మారింది. పదేళ్ల క్రితం అల్వరేజ్ 12 ఏళ్ల వయసులో మెస్సీ కోసం నిరీక్షించి మరీ అతనితో ఫోటో దిగాడు. కట్‌చేస్తే ఇప్పుడు మెస్సీతో కలిసి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 40 ఏళ్ల తర్వాత అర్జెంటీనా(1986 ఫిఫా వరల్డ్‌కప్ విజేత) కలను నిజం చేయాలని చూస్తున్న మెస్సీకి అల్వరేజ్ తనవంతు సహాయం అందిస్తున్నాడు. మొత్తానికి 10 ఏళ్ల వయసులో మెస్సీ కోసం నిరీక్షించిన అల్వరేజ్.. తాజాగా మెస్సీతో కలిసి ఆటను పంచుకోవడం అభిమానులకు కన్నులపండువగా ఉంది.
10 years ago: asking Leo Messi for a pic as big fan, dreaming of World Cup one day…
— Fabrizio Romano (@FabrizioRomano) December 13, 2022
Tonight: Julián Álvarez from Calchín scores in World Cup semifinal.
🕷️🇦🇷 #Qatar2022 pic.twitter.com/DhwozBijJu
Comments
Please login to add a commentAdd a comment