FIFA: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్‌ | SBI Passbook Trends Ahead Argentina Vs France Final FIFA WC 2022 Match | Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్‌

Published Fri, Dec 16 2022 9:10 PM | Last Updated on Fri, Dec 16 2022 9:11 PM

SBI Passbook Trends Ahead Argentina Vs France Final FIFA WC 2022 Match - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. డిసెంబర్‌ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్‌ మధ్య జరగనున్నఫైనల్‌తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీపైనే నెలకొన్నాయి. తన కెరీర్‌లో అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తన దేశం తరపున చివరి మ్యాచ్‌ అని ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్‌ కొట్టడమే గాక సూపర్‌ అసిస్ట్స్‌తోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తున్న మెస్సీ ఎలాగైన ఫిఫా వరల్డకప్‌ కొట్టాలని కోరుకుందాం. 

అయితే అర్జెంటీనా ఫైనల్‌ చేరిన క్రమంలో భారత్‌కు చెందిన ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)కు చెందిన పాస్‌బుక్‌ ట్విట్టర్‌ ట్రెండింగ్‌ లిస్టులో నిలిచింది. అదేంటి అర్జెంటీనాతో ఎస్‌బీఐ పాక్‌బుక్‌కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ట్రెండింగ్‌లో నిలవడానికి  కారణం ఏంటంటే అర్జెంటీనా, ఎస్‌బీఐ పాస్‌ బుక్‌ రంగు ఒకటి కావడమే.

అర్జెంటీనా జెర్సీ లైట్‌ బ్లూ, వైట్‌ కలర్స్‌తో నిలువు చెక్స్‌తో ఉంటుంది. ఇక ఎస్‌బీఐ పాస్‌బుక్‌ అవే కలర్స్‌తో అడ్డంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్‌కు చెందిన ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ ఎస్‌బీఐ పాస్‌బుక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి #Win Argentina హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌బీఐ పాస్‌బుక్‌ ఫొటోలు ట్విటర్‌లో వైరల్‌గా మారింది. 

చదవండి: Lionel Messi: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement