
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా తిరిగి కోచ్‌గా జాతీయ షూటింగ్ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్‌ఆర్‌ఏఐ).. జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్’ కోచ్‌గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్‌ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేసింది.
జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్ కప్ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్ చాంపియన్íÙప్ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ శిక్షణ ఇవ్వనున్నాడు.
రైఫిల్ విభాగానికి హెడ్ కోచ్‌గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్‌పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్‌ఆర్‌ఏఐ 16 మంది కొత్త కోచ్‌లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.
పిస్టల్ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్‌కు అమరిందర్ చీమ, ట్రాప్‌కు వర్ష తోమర్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్లుగా మాన్‌షేర్ సింగ్, రోనక్ పండిట్‌ను ఎన్‌ఆర్‌ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్ చండేల్ (ఎయిర్ రైఫిల్), అన్వర్ సుల్తాన్ (ట్రాప్), మనోజ్ కుమార్ (50 మీటర్ల రైఫిల్) హై పెర్ఫార్మెన్స్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment