పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజత పతకాలు సాధించారు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల ఐదో రోజు సోమవారం స్వర్ణంతో భారత పతకాల వేటకు శ్రీకారం చుట్టారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజత పతకాలు సాధించారు.
భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. జీతూ రాయ్ 174.1, గురుపాల్ సింగ్ 167 పాయింట్లు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్లో భారత్కు ఇప్పటి వరకు 11 పతకాలు దక్కాయి.