Jitu Rai
-
జీతూ గురి అదిరె...
షూటింగ్లో భారత స్టార్స్ మళ్లీ మెరిశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ స్వర్ణం... ఓం మితర్వల్ కాంస్యం గెలిచారు. ఫైనల్లో జీతూ రాయ్ 235.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఓం మితర్వల్ 214.3 పాయింట్లు సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. రజతంతో ముగించిన లిఫ్టర్లు.. వెయిట్‌లిఫ్టింగ్ పోటీల చివరి రోజు భారత్‌కు రజతం లభించింది. పురుషుల 105 కేజీల విభాగంలో ప్రదీప్ సింగ్ మొత్తం 352 కేజీల (స్నాచ్‌లో 152+క్లీన్ అండ్ జెర్క్‌లో 200) బరువెత్తి రజత పతకం గెలిచాడు. ఓవరాల్‌గా ఈ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించడం విశేషం. -
కామన్వెల్త్లో భారత్ గోల్డెన్ రన్!
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. తాజాగా భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. సోమవారం జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్‌ను కొల్లగొట్టాడు. కాగా, ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్ కెర్రీ బెల్ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 214.3 పాయింట్లతో ఓంప్రకాశ్ కాంస్యాన్ని సాధించాడు. దీంతో భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 84 పతకాల (31 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)తో మొదటిస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 48 పతకాల(19 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు)తో రెండోస్థానంలో ఉంది. -
రికార్డు స్కోరుతో స్వర్ణం
తిరువనంతపురం: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షూటర్ జీతూరాయ్ పసిడి గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్ పోరులో రికార్డు స్థాయిలో 233 పాయింట్లు సాధించి పసిడితో మెరిశాడు. ఈ ఫైనల్ ఈవెంట్లో జీతూరాయ్ సాధించిన 233 స్కోరే అత్యధికం కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు ఓంకార్ సింగ్ (222.4), జై సింగ్ (198.4) వరుసగా రజతం, కాంస్యం దక్కించుకున్నారు. జట్టు విభాగంలో జీతూ, ఓం ప్రకాశ్, జై సింగ్‌ల బృందం 1658 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. ఎయిర్ ఫోర్స్ జట్టు (1626)కు రజతం, పంజాబ్ (1624) కాంస్యం దక్కాయి. జూనియర్ పురుషుల విభాగంలో అర్జున్ సింగ్ చిమా 226.5 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. సురీంద్ సింగ్ (221.9), అమోల్ జైన్ (205.1) తో రజత, కాంస్యాలు సాధించారు. -
జీతూరాయ్ కు కాంస్యం
న్యూఢిల్లీ:అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య(ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ షూటర్ జీతూరాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో జీతూరాయ్ మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జీతూరాయ్ 216.7 పాయింట్లతో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఈవెంట్ తొలి కాంపిటేషన్ రౌండ్ ముగిసిన తరువాత ఏడో స్థానంలో నిలిచిన జీతూరాయ్.. ఆ తరువాత సత్తా చాటుకుంటూ క్రమేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. రజత పతకాన్ని సాధించడానికి జీతూరాయ్ తీవ్రంగా యత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఇందులో జపాన్ కు చెందని తముయుకి మత్సుద 240.1 పాయింట్లతో పసిడిని సాధించగా, వియత్నాంకు చెందిన విన్హ హాంగ్ 236.6 పాయింట్లతో రజతం సాధించాడు. జీతూరాయ్ తాజా పతకంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.అంతకుముందు జీతూరాయ్-హీనా సిద్ధూ జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో పసిడి సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అంకుర్ మిట్టల్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించాడు. -
రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్
భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ మరోసారి నిరాశపరిచాడు. బుధవారం జరిగిన 50 మీటర్ల పిస్టర్ విభాగంలో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. చివరి రౌండ్ లో 8, 8 తో స్టార్ట్ చేసిన జీతూ.. కేవలం 554 పాయింట్లు స్కోర్ చేసి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ ప్రకాశ్ నంజప్పా 547 పాయింట్లు స్కోరు చేసి 25వ స్థానంలో నిలిచి దారుణ ప్రదర్శన చేశాడు. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా టాప్ 8 లో నిలవాల్సిన ఈవెంట్లో భారత షూటర్లు గురి తప్పారు. రియోలో పోటీపడ్డ తొలి ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో నిరాశపరిచిన జీతూ.. అతి కష్టం మీద ఫైనల్‌కు అర్హత సాధించినా పతకం నెగ్గలేకపోయిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా ఆర్చర్ బొంబేలా దేవి బాణం గురితప్పలేదు. రౌండ్-64, రౌండ్-32లలో ఏకాగ్రతతో బాణాలు సంధించి విజయాన్ని నమోదుచేసి రౌండ్-16(ప్రీ క్వార్టర్స్) కు చేరుకుని భారత శిబిరంలో ఆశలు నింపింది. -
జీతూ రాయ్‌కు స్వర్ణం
బ్యాంకాక్:ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ జీతూ రాయ్ మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50మీ పిస్టోల్ ఈవెంట్లో జీతూ రాయ్ స్వర్ణం సాధించి సత్తా చాటుకున్నాడు. ఫైనల్ రౌండ్లో 191.3 పాయింట్లు సాధించడంతో అగ్రస్థానాన్ని దక్కించుకున్న జీతూ పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, మాజీ వరల్డ్ చాంపియన్, చైనా షూటర్ పాంగ్ వో 186.5 పాయింట్లతో రెండో స్థానాన్ని సాధించి రజతాన్ని సాధించగా, మరో చైనా ఆటగాడు, ఒలింపిక్ పతక విజేత వాంగ్ హివెయ్ 165.8 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో మూడో స్థానం సాధించిన జితూ రాయ్ ఫైనల్ రౌండ్లో మాత్రం అంచనాలు మించి రాణించాడు. క్వాలింగ్ ఫయింగ్ సిరీస్ లో పాంగ్ వో, వాంగ్ హివెయ్ తొలి రెండు స్థానాల్లో నిలిచినా.. ఫైనల్ పోరులో మాత్రం జీతూ రాయ్ ప్రథమ స్థానంలో నిలిచి పసిడిని సాధించడం విశేషం. -
జీతూ రాయ్‌కు కాంస్యం
చాంగ్వాన్ (కొరియా): ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్స్‌లో అతను 181.1 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కేవలం 0.4 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకం కోసం జరిగే షూటవుట్‌ను కోల్పోయాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇది జీతూకు ఏడో పతకం. ఇదే విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో ఇతర భారత షూటర్లు ప్రకాశ్ నంజప్ప, గుర్ప్రీత్ సింగ్ 18, 48వ స్థానాల్లో నిలిచారు. ఇక 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో చైన్ సింగ్ ఎనిమిది మందితో కూడిన ఫైనల్స్‌కు అర్హత సాధించినా ఆరో స్థానం పొందాడు. శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్‌కే చెందిన అపూర్వీ చండేలా కాంస్యం సాధించడంతోపాటు రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన సంగతి తెలిసిందే. -
'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'
ఇంచియూన్: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో కాంస్యం గెలిచిన జీతూ రాయ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. తాజాగా 10 మీ. ఎరుుర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో కాంస్యంతో కలుపుకుని 2014లో ఏడు పతకాలు సాధించాడు. ఈ సీజన్లో విజయువంతం కావడంపై ఈ భారత షూటర్ తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఇదే జోరును 2016 రియో ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇక ఆసియూ క్రీడల్లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న జీతు తాను అనుకున్నది సాధించడం కోసం కనీసం తన తల్లితో కూడా ఫోన్లో మాట్లాడలేదట. ‘గత నెల్లో ప్రపంచ చాంపియున్‌షిప్ కోసం స్పెయిన్‌కు వెళ్లినప్పటి నుంచి అమ్మతో మాట్లాడలేదు. నేను స్వర్ణం గెలిచిన విషయుం అమ్మకు ఇంకా తెలియులేదు. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి అమ్మతో మాట్లాడతా'అని జీతూ రాయ్ తెలిపాడు. -
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం దక్కించుకుంది. రెండో రోజు షూటింగ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్పా కూడిన బృందం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ఈ టోర్నిలో జీతూ రాయ్ రెండో పతకం సాధించడం విశేషం. తొలిరోజు అతడు స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అతడు పసిడి పతకం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదురి కాంస్యం కైవసం చేసుకుంది. -
జీతూ రాయ్ కు రూ.50 లక్షల నజరానా
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో తొలిస్వర్ణం సాధించిన భారత షూటర్, ఉత్తరప్రదేశ్ క్రీడాకారుడు జీతూ రాయ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు నజరానా ప్రకటించింది. ఇచియాన్ లో ఆరంభమైన ఆసియా క్రీడల్లో జీతూ స్వర్ణం సాదించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాను ప్రకటించారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో ప్రపంచ ఐదో నంబర్ క్రీడాకారుడు జీతూ రాయ్ భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
జీతురాయ్ ఇతర క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రశంసలు
న్యూఢిల్లీ: గ్రాస్గోవ్ లో జరుగుతున్న 20వ కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలను సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం అభినందించారు. రాష్ట్రపతి అభినందించిన వారిలో జీతు రాయ్, గుర్పాల్ సింగ్, గగన్ నారంగ్ లు షూటింగ్, వికాస్ ఠాకూర్ కు వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో పతకాలు సాధించారు. కామన్ వెల్త్ లో భారతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులను రాష్ట్రపతి అభినందించినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ వ్యక్తిగతంగా సందేశాలు పంపారని అధికారులు తెలిపారు. జీతురాయ్ బంగారు, గుర్పాల్ సింగ్ రజత, నారంగ్ రజత పతకాలు సాధించారు. -
రాయ్ బంగారం.. సింగ్ రజతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల ఐదో రోజు సోమవారం స్వర్ణంతో భారత పతకాల వేటకు శ్రీకారం చుట్టారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. జీతూ రాయ్ 174.1, గురుపాల్ సింగ్ 167 పాయింట్లు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్లో భారత్‌కు ఇప్పటి వరకు 11 పతకాలు దక్కాయి.