జీతూ రాయ్‌కు కాంస్యం
చాంగ్‌వాన్ (కొరియా): ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్స్‌లో అతను 181.1 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కేవలం 0.4 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకం కోసం జరిగే షూటవుట్‌ను కోల్పోయాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇది జీతూకు ఏడో పతకం. ఇదే విభాగం క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇతర భారత షూటర్లు ప్రకాశ్ నంజప్ప, గుర్‌ప్రీత్ సింగ్ 18, 48వ స్థానాల్లో నిలిచారు. ఇక 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో చైన్ సింగ్ ఎనిమిది మందితో కూడిన ఫైనల్స్‌కు అర్హత సాధించినా ఆరో స్థానం పొందాడు. శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన అపూర్వీ చండేలా కాంస్యం సాధించడంతోపాటు రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన సంగతి తెలిసిందే.