World Cup Shooting Tournament
-
షూటర్ సిఫ్ట్ కౌర్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో పతకం లభించింది. మ్యూనిక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 452.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. -
సరబ్జోత్ ‘పసిడి’ గురి
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. వరల్డ్ చాంపియన్, నాలుగుసార్లు ఒలింపియన్ తదితర మేటి షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో 22 ఏళ్ల సరబ్జోత్ 242.7 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. బు షుహైహాంగ్ (చైనా; 242.5 పాయింట్లు) రజతం నెగ్గగా... రాబిన్ వాల్టర్ (జర్మనీ; 220 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
ఇలవేనిల్ ‘పసిడి’ గురి
రియో డి జనీరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేనిల్ వలారివన్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఇలవేనిల్ 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో ఇలవేనిల్ 630.5 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోరీ్నలలో ఇలవేనిల్కిది ఐదో స్వర్ణ పతకం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ సందీప్ సింగ్ 628.2 పాయింట్లు సాధించి 14వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. -
ISSF World Cup Baku: సరబ్జోత్–దివ్య జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్–దివ్య థడిగోల్ సుబ్బరాజు (భారత్) ద్వయం విజేతగా నిలిచింది. స్వర్ణ–రజత పతక ఫైనల్ పోరులో సరబ్జోత్–దివ్య జోడీ 16–14తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయంపై విజయం సాధించింది. సరబ్జోత్ కెరీర్లో ఇది రెండో ప్రపంచకప్ స్వర్ణంకాగా... బెంగళూరుకు చెందిన దివ్యకు ప్రపంచకప్ టోర్నీలలో తొలి పతకం కావడం విశేషం. మొత్తం 55 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్–దివ్య ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన ఇషా సింగ్–వరుణ్ తోమర్ జంట 578 పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్‌లో నిలిచి పతక మ్యాచ్‌లకు అర్హత పొందడంలో విఫలమైంది. టాప్–4లో నిలిచిన జోడీలు పతక మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో రెండు పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ప్రతాప్ సింగ్‌కు స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్ సింగ్ 16–6తో అలెగ్జాండర్ షిమిర్ల్ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో షిమిర్ల్, ప్రతాప్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరారు. భారత్‌కే చెందిన అఖిల్ షెరాన్ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ రెండో ర్యాంకింగ్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్, ఇషా సింగ్ క్వాలిఫయింగ్‌లో వరుసగా 32వ, 34వ స్థానాల్లో నిలిచారు. -
రుద్రాంక్ష్ పసిడి గురి
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకం సాధించగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ సేన్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో రుద్రాంక్ష్ 16–8తో మాక్సిమిలన్ ఉల్బ్రిచ్ (జర్మనీ)పై గెలిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో రుద్రాంక్ష్ 262 పాయింట్లు, ఉల్బ్రిచ్ 260.6 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. మిరాన్ మారిసిచ్ (క్రొయేషియా; 260.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. 74 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 629.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ రౌండ్‌కు చేరాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ రౌండ్లో పోటీపడతారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ర్యాంకింగ్ రౌండ్లో తిలోత్తమ సేన్ 262 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. ప్రస్తుతం భారత్ 3 స్వర్ణాలు, 2 కాంస్యాలతో కలిపి ఐదు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
Cairo Shooting World Cup: భారత షూటర్ వరుణ్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో బోణీ చేసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల వరుణ్ తోమర్ మూడో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో నిర్ణీత ఐదు సిరీస్‌ల తర్వాత వరుణ్, సరబ్‌జ్యోత్ సింగ్ 250.6 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ‘షూట్ ఆఫ్ షాట్’లో వరుణ్ 10.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం దక్కించుకోగా... సరబ్‌జ్యోత్ 10.1 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. -
World Cup 2022: చరిత్ర సృష్టించిన మేరాజ్
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... మేరాజ్ అహ్మద్ ఖాన్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించాడు. సోమవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల మేరాజ్ 40 పాయింట్లకుగాను 37 పాయింట్లు స్కోరు చేశాడు. నలుగురు పాల్గొన్న ఫైనల్లో ‘డబుల్ ఒలింపియన్’ మేరాజ్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. మిన్సు కిమ్ (కొరియా; 36 పాయింట్లు) రజతం, బెన్ లెలెవెలిన్ (బ్రిటన్; 26 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. 35 మంది షూటర్ల మధ్య రెండు రోజులపాటు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో మేరాజ్ 119 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు. నలుగురు షూటర్ల మధ్య జరిగిన రెండో ర్యాంకింగ్ మ్యాచ్‌లో మేరాజ్ 27 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2016 రియో డి జనీరో ప్రపంచకప్ టోర్నీలో మేరాజ్ రజత పతకం సాధించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్, ఆశీ చౌక్సీ, సిఫ్ట్‌కౌర్ సామ్రాలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 16–6తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
అర్జున్ గురి అదిరె...
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ సీజన్‌లోని మూడో ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పసిడి బోణీ కొట్టింది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఫలితంతో స్వర్ణ పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అర్జున్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం. 2016 జూనియర్ ప్రపంచకప్‌లో అతను స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన అమెరికా షూటర్ లుకాస్ కొజెనిస్కయ్తో జరిగిన ఫైనల్లో అర్జున్ 17–9తో గెలుపొందాడు. కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో పోటీపడుతున్న ఇద్దరు షూటర్లలో తొలుత 16 పాయింట్లు గెలిచిన షూటర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో షాట్లో ఇద్దరు షూటర్లలో అత్యధిక స్కోరింగ్ షాట్ సాధించిన షూటర్‌కు రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఇద్దరు స్కోరింగ్ షాట్ సమంగా ఉంటే ఒక్కో పాయింట్ ఇస్తారు. లుకాస్‌తో జరిగిన ఫైనల్లో 13 షాట్లలో అర్జున్ ఎనిమిదింట పైచేయి సాధించగా, లుకాస్ నాలుగు షాట్లలో భారత షూటర్కంటే ఎక్కువ స్కోరు చేశాడు. మరో షాట్లో ఇద్దరూ సమానంగా స్కోరింగ్ షాట్ కొట్టారు. అంతకుముందు ఎనిమిది మంది మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో అర్జున్ 261.1 పాయింట్లు, లుకాస్ 260.4 పాయింట్లు సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన పార్థ్ మఖీజా 258.1 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు అర్జున్ బబూటా, పార్థ్ మఖీజా ఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలపై గురి పెట్టారు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. 53 మంది షూటర్ల మధ్య ఆదివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌లో అర్జున్ 630.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో, పార్థ్ 628.4 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారి మధ్య నేడు ఫైనల్ జరగనుంది. -
ఇషా గురికి రెండో స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, రాహీ సర్నోబత్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో భారత జట్టు 17–13తో సింగపూర్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో 17 ఏళ్ల ఇషా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. ఆదివారమే జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో అఖిల్ షెరాన్–శ్రియాంక జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. అఖిల్–శ్రియాంక జంట 16–10తో రెబెకా–రుంప్లెర్ (ఆస్ట్రియా) ద్వయంపై గెలిచింది. -
Rahi Sarnobat: రాహీ పసిడి గురి
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పసిడి పతకం లభించింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాహీ సర్నోబత్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల రాహీ ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 39 పాయింట్లు స్కోరు చేసింది. లామోలి మథిల్డె (ఫ్రాన్స్–31 పాయింట్లు) రజతం, వితాలినా (రష్యా–28 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మరో షూటర్ మనూ భాకర్ 11 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 49 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రాహీ 591 పాయింట్లు... మనూ 588 పాయింట్లు స్కోరు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని సావంత్ క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది. -
భారత మహిళల పిస్టల్ జట్టుకు కాంస్యం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో కాంస్య పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్, రాహీ సర్నోబత్, యశస్విని సింగ్‌లతో కూడిన భారత బృందం మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మనూ, రాహీ, యశస్విని త్రయం 16–12 పాయింట్ల తేడాతో వెరోనికా, మిరియమ్ జాకో, సారా రాహెల్‌లతో కూడిన హంగేరి జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కాంస్య పతక పోరులో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 14–16తో మిలెంకో, స్టెఫనోవిచ్, లాజార్‌లతో కూడిన సెర్బియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల స్కీట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ గుర్జత్ ఖంగురా క్వాలిఫయింగ్‌లో 115 పాయింట్లు స్కోరు చేసి 56వ స్థానంలో నిలిచాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ రెండు విభాగాల్లో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశముంది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సౌరభ్ కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. మనూ, రాహీ, యశస్విని -
‘పసిడి’తో ముగింపు
న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత షూటర్లు ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను స్వర్ణ పతకాలతో ముగించారు. టోర్నీ చివరి రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. ఓవరాల్‌గా భారత్ 15 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 30 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ టోర్నీ ల చరిత్రలో ఒకే ఈవెంట్లో ఒక దేశానికి 15 స్వర్ణాలు రావడం ఇదే ప్రథమం. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో గుర్ప్రీత్ సింగ్, విజయ్‌వీర్ సిద్ధూ, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 2–10తో సాండెర్సన్, హాబ్సన్, టర్నర్లతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. మహిళల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో శ్రేయసి, రాజేశ్వరి, మనీషాలతో కూడిన భారత జట్టు 6–0తో మరియా, ఐజాన్, సర్సెన్‌కుల్‌లతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, పృథ్వీరాజ్, లక్షయ్‌లతో కూడిన భారత పురుషుల ట్రాప్ జట్టు టీమ్ ఫైనల్లో 6–4తో స్లామ్‌కా, అడ్రియన్, మరినోవ్‌లతో కూడిన స్లొవేకియా జట్టుపై గెలిచి స్వర్ణాన్ని నెగ్గింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 8 పతకాలతో అమె రికా రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో 53 దేశాల నుంచి 294 మంది షూటర్లు పాల్గొన్నారు. -
25 పతకాలతో టాప్‌లో..
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. టోర్నీ ఎనిమిదో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్–తేజస్విని సావంత్ జంట పసిడి పతకం నెగ్గగా... ఐశ్వరీ ప్రతాప్‌సింగ్–సునిధి ద్వయం కాంస్యం గెలి చింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ పురుషుల టీమ్ ఈవెంట్లో స్వప్నిల్, చెయిన్ సింగ్, నీరజ్ లతో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్‌వీర్‌కు రజతం దక్కింది. ప్రస్తుతం భారత్ 12 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
‘మావాడితో కలిసి ఆడం’
న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఆటగాళ్లపైనో, వారి నిబంధనల ఉల్లంఘనపైనో మరో జట్టు ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం, పరిష్కారానికి నిర్వహకులు జోక్యం చేసుకోవడం చాలా టోర్నీలలో సహజంగా కనిపించే విషయం. అయితే అందుకు భిన్నంగా తమ జట్టు సహచరుడిపైనే మరొకరు ఫిర్యాదు చేసి అతనితో కలిసి బరిలోకి దిగేందుకు నిరాకరించడం విశేషం. మరికొద్ది నిమిషాల్లో పోటీ అనగా... హంగేరీ షూటర్లు ఇస్తవాన్ పెని, జవన్ పెక్లర్ తమ తోటి షూటర్ పీటర్ సిడీ నిబంధనలకు విరుద్ధంగా ‘బైపాడ్’ అతికిచ్చి ఉన్న రైఫిల్‌తో పోటీలో పాల్గొంటున్నాడని ఆరోపిస్తూ తాము ఫైనల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ చదవండి: టోక్యో ‘జ్యోతి’ బయల్దేరింది దీనిపై స్పందించిన ఐఎస్ఎస్ఎఫ్ అధికారులు మాత్రం అతను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా రూల్స్ విషయంలో తమకు హంగేరీ ప్లేయర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఘాటుగా స్పందించారు. అయితే నిబంధనలకంటే ఆటగాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. సిడీ 2000నుంచి వరుసగా 5 ఒలింపిక్స్‌లో పాల్గొనగా, ఇస్తవాన్ పెని ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నా డు. తాజా వివాదంతో భారత్‌తో ఫైనల్లో పోటీ పడేందుకు అమెరికా అర్హత సాధించగా...ఫైనల్‌ను నేటికి వాయిదా వేశారు. ఇక్కడ చదవండి: ‘టీమ్’ ఈవెంట్లలో మరో 2 పతకాలు -
‘టీమ్’ ఈవెంట్లలో మరో 2 పతకాలు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో ఏడో రోజు గురువారం భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చింకీ యాదవ్, రాహీ సర్నోబత్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 17–7తో వార్జోనొస్కా, జులిటా బోరెక్, అగ్నీస్కా కొరెజ్వోలతో కూడిన పోలండ్ జట్టుపై గెలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్, శ్రేయ సక్సేనా, గాయత్రి నిత్యానందమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 43–47తో అనెటా స్టాన్కివిచ్, అలెక్సాండ్రా, నటాలియా కొచనస్కాలతో కూడిన పోలండ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్ 10 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 21 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ‘మావాడితో కలిసి ఆడం’ ప్రత్యర్థి ఆటగాళ్లపైనో, వారి నిబంధనల ఉల్లంఘనపైనో మరో జట్టు ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం, పరిష్కారానికి నిర్వహకులు జోక్యం చేసుకోవడం చాలా టోర్నీలలో సహజంగా కనిపించే విషయం. అయితే అందుకు భిన్నంగా తమ జట్టు సహచరుడిపైనే మరొకరు ఫిర్యాదు చేసి అతనితో కలిసి బరిలోకి దిగేందుకు నిరాకరించడం విశేషం. మరికొద్ది నిమిషాల్లో పోటీ అనగా... హంగేరీ షూటర్లు ఇస్తవాన్ పెని, జవన్ పెక్లర్ తమ తోటి షూటర్ పీటర్ సిడీ నిబంధనలకు విరుద్ధంగా ‘బైపాడ్’ అతికిచ్చి ఉన్న రైఫిల్‌తో పోటీలో పాల్గొంటున్నాడని ఆరోపిస్తూ తాము ఫైనల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిపై స్పందించిన ఐఎస్ఎస్ఎఫ్ అధికారులు మాత్రం అతను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా రూల్స్ విషయంలో తమకు హంగేరీ ప్లేయర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఘాటుగా స్పందించారు. అయితే నిబంధనలకంటే ఆటగాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. సిడీ 2000నుంచి వరుసగా 5 ఒలింపిక్స్‌లో పాల్గొనగా, ఇస్తవాన్ పెని ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నా డు. తాజా వివాదంతో భారత్‌తో ఫైనల్లో పోటీ పడేందుకు అమెరికా అర్హత సాధించగా...ఫైనల్‌ను నేటికి వాయిదా వేశారు. -
పిస్టల్‌లో క్లీన్‌స్వీప్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్నీ ఆరో రోజు బుధవారం భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అందుబాటులో ఉన్న మూడు పతకాలను నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు. ఈ ఫైనల్లో చింకీ యాదవ్‌కు స్వర్ణం దక్కగా... రాహీ సర్నోబత్ రజతం, మనూ భాకర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మనూ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. చింకీ యాదవ్, రాహీ 32 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ నిర్వహిం చగా... చింకీ యాదవ్ 4 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. 3 పాయింట్లు స్కోరు చేసిన రాహీకి రజతం దక్కింది. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఈ ముగ్గురు భారత మహిళా షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రతాప్ సింగ్ ఘనత మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రతాప్ సింగ్ ఘనత వహించాడు. 20 ఏళ్ల ప్రతాప్ సింగ్ 462.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్తవన్ పెనీ (హంగేరి–461.6 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా... స్టీఫెన్ ఒల్సెన్ (డెన్మార్క్–450.9 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు తేజస్విని సావంత్ 12వ స్థానంలో, అంజుమ్ మౌద్గిల్ 16వ స్థానంలో, సునిధి చౌహాన్ 17వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో సోమవారం భారత షూటర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ (భారత్) జోడీ 16–12తో గొల్నూష్–జావేద్ ఫరూఖ్ (ఇరాన్) జంటపై నెగ్గి పసిడి పతకం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ (భారత్) ద్వయం 16–10తో డెనిస్ ఎస్టర్–ఇస్తవన్ పెనీ (హంగేరి) జోడీని ఓడించి బంగారు పతకం దక్కించుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గుర్జోత్, మేరాజ్ అహ్మద్‌ఖాన్, అంగద్ వీర్‌బజ్వాలతో కూడిన భారత జట్టు 6–2తో నాసిర్, అలీ అహ్మద్, రషీద్ లతో కూడిన ఖతర్ జట్టుపై గెలిచి స్వర్ణ పతకం సాధించింది. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో పరీనాజ్, కార్తీకి సింగ్, గనీమత్‌లతో కూడిన భారత జట్టు 4–6తో జోయా, రినాటా, ఓల్గాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
భారత్ ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: మరోసారి తమ సత్తా నిరూపించుకుంటూ భారత షూటర్లు ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మూడో రోజు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల, పురుషుల టీమ్ ఈవెంట్స్‌లో టీమిండియాకు రెండు పసిడి పతకాలు లభించాయి. యశస్విని, మనూ భాకర్, శ్రీనివేథాలతో కూడిన భారత మహిళల ఎయిర్ పిస్టల్ జట్టు ఫైనల్లో 16–8 స్కోరుతో జులీటా బొరెక్, జోనా ఐవోనా, అగ్నెస్కాలతో కూడిన పోలాండ్ జట్టుపై గెలిచింది. సౌరభ్, రిజ్వీ, అభిషేక్ వర్మలతో కూడిన భారత పురుషుల ఎయిర్ పిస్టల్ జట్టు ఫైనల్లో 17–11 స్కోరుతో దిన్ తాన్, క్వాక్ ట్రాన్, చుయెన్ ఫాన్లతో కూడిన వియత్నాం జట్టును ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్లో దీపక్, పంకజ్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి రజతం లభించింది. ఫైనల్లో టీమిండియా 14–16 స్కోరుతో లుకాస్, విలియమ్, షెర్రీలతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది. మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ గనేమత్ సెఖోన్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో గనేమత్ 40 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో స్కీట్ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా గనేమత్ గుర్తింపు పొందింది. మూడో రోజు పోటీలు ముగిసిన తర్వాత భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
యశస్విని ‘పసిడి’ గురి
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో రెండో రోజు భారత షూటర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో యశస్విని సింగ్ స్వర్ణం... మనూ భాకర్ రజతం గెల్చుకున్నారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్స్‌లో యశస్విని 238.8 పాయింట్లు... మనూ 236.7 పాయింట్లు స్కోరు చేశారు. ఇప్పటికే వీరిద్దరు ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. భారత్‌కే చెందిన మరో షూటర్ నివేథా 193.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ (243.2 పాయింట్లు) రజతం... అభిషేక్ వర్మ (221.8 పాయింట్లు) కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దివ్యాంశ్ సింగ్ పన్వర్ (228.1 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్ 187.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. టోర్నీ ప్రారంభానికి ముందు ఇద్దరు భారత పిస్టల్ షూటర్లతో సహా మరొక విదేశీ షూటర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో ఈ ముగ్గురు షూటర్లు టోర్నీ నుంచి వైదొలిగారు. -
యశస్విని సింగ్ పసిడి గురి...
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్–234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా –215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు. -
అభిషేక్ అదరహో
బీజింగ్: ఆడుతోంది తొలి ప్రపంచకప్ ఫైనల్... బరిలో మేటి షూటర్లు... అయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు... ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి ఒకే గురికి రెండు లక్ష్యాలు సాధించాడు భారత షూటర్ అభిషేక్ వర్మ. ఇక్కడ జరుగుతోన్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో అభిషేక్ వర్మ రూపంలో భారత్‌కు మూడో స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ 242.7 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెల్చుకున్నాడు. అంతేకాకుండా భారత్‌కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. అర్తెమ్ చెముస్కోవ్ (రష్యా–240.4 పాయింట్లు) రజతం... సెయుంగ్వు హాన్ (కొరియా–220 పాయింట్లు) కాంస్యం సాధించారు. హరియాణాలో న్యాయవాదిగా ఉన్న 29 ఏళ్ల అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో తొలి షాట్ నుంచి చివరి షాట్ ముగిసేవరకు అభిషేక్ ఆధిక్యంలో ఉండటం విశేషం. -
రజతం... ఒలింపిక్ బెర్త్
బీజింగ్: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో రాజస్తాన్ టీనేజ్ షూటర్ దివాన్ష్ సింగ్ పన్వర్ పసిడి పతకంపై గురి పెట్టాడు. కానీ త్రుటిలో బంగారం చేజారినా... బంగారంలాంటి ఒలింపిక్స్ కోటా మాత్రం దక్కింది. ఇక్కడ జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అతను 249 పాయింట్లు సాధించాడు. కేవలం 0.4 పాయింట్ల తేడాతో స్వర్ణావకాశం కోల్పోయిన 17 ఏళ్ల దివాన్ష్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆతిథ్య చైనాకు చెందిన జిచెంగ్ హుయ్ 249.4 పాయింట్లతో పసిడి నెగ్గాడు. తాజా దివ్యాన్‡్ష ప్రదర్శనతో భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో బెర్త్ లభించింది. ఇదివరకు అంజుమ్, అపూర్వీ చండేలా (మహిళలు), సౌరభ్ (పురుషులు) ఒలింపిక్స్ కోటాలు సాధించారు. -
స్వర్ణంతో సమాప్తం
న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్ చివరి రోజు భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో సౌరభ్ చౌధరీ–మను భాకర్ జంట పసిడి పతకం గెల్చుకుంది. దాంతో ఈ మెగా ఈవెంట్‌ను భారత్ స్వర్ణంతో ముగించింది. ఓవరాల్‌గా హంగేరి, భారత్ మూడు స్వర్ణాల చొప్పున సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువడం విశేషం. భారత షూటర్లు రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పడంతోపాటు ఒక ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకున్నారు. టోర్నమెంట్ ఆఖరి రోజు బుధవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో సౌరభ్ చౌధరీ–మను భాకర్ జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. రాన్‌జిన్ జియాన్–బోవెన్ జాంగ్ (చైనా–477.7 పాయింట్లు) జోడీ రజతం... మిన్‌జుంగ్ కిమ్–డేహన్ పార్క్ (కొరియా–418.8 పాయింట్లు) ద్వయం కాంస్యం సొంతం చేసుకున్నాయి. 39 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్–మను జోడీ 778 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డును సమం చేయడంతోపాటు అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. టాప్–5 జోడీలు ఫైనల్లోకి ప్రవేశించాయి. అంతకుముందు జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవి కుమార్–అంజుమ్ మౌద్గిల్ (భారత్) జంట క్వాలిఫయింగ్‌లో 836.3 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.