రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్ | Jitu Rai, Prakash Nanjappa fail to qualify for the 50m Pistol finals | Sakshi
Sakshi News home page

రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్

Published Wed, Aug 10 2016 7:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్

రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్

భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ మరోసారి నిరాశపరిచాడు. బుధవారం జరిగిన 50 మీటర్ల పిస్టర్ విభాగంలో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. చివరి రౌండ్ లో 8, 8 తో స్టార్ట్ చేసిన జీతూ.. కేవలం 554 పాయింట్లు స్కోర్ చేసి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ ప్రకాశ్ నంజప్పా 547 పాయింట్లు స్కోరు చేసి 25వ స్థానంలో నిలిచి దారుణ ప్రదర్శన చేశాడు.

ఫైనల్ చేరాలంటే కచ్చితంగా టాప్ 8 లో నిలవాల్సిన ఈవెంట్లో భారత షూటర్లు గురి తప్పారు. రియోలో పోటీపడ్డ తొలి ఈవెంట్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో నిరాశపరిచిన జీతూ.. అతి కష్టం మీద ఫైనల్‌కు అర్హత సాధించినా పతకం నెగ్గలేకపోయిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా ఆర్చర్ బొంబేలా దేవి బాణం గురితప్పలేదు. రౌండ్-64, రౌండ్-32లలో ఏకాగ్రతతో బాణాలు సంధించి విజయాన్ని నమోదుచేసి రౌండ్-16(ప్రీ క్వార్టర్స్) కు చేరుకుని భారత శిబిరంలో ఆశలు నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement