ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.
బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి.
ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం
Published Sat, Sep 20 2014 10:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement