Shweta Chaudhary
-
జీతూ రాయ్ కు రూ.50 లక్షల నజరానా
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో తొలిస్వర్ణం సాధించిన భారత షూటర్, ఉత్తరప్రదేశ్ క్రీడాకారుడు జీతూ రాయ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు నజరానా ప్రకటించింది. ఇచియాన్ లో ఆరంభమైన ఆసియా క్రీడల్లో జీతూ స్వర్ణం సాదించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాను ప్రకటించారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో ప్రపంచ ఐదో నంబర్ క్రీడాకారుడు జీతూ రాయ్ భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
బోణీ కొట్టిన భారత్, శ్వేతా చౌదరికి కాంస్యం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో వైభవంగా ప్రారంభమైన ఏషియాడ్ గేమ్స్‌లో భారత క్రీడాకారిణి శ్వేతా చౌదరి తొలి పతాకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో శనివారం నుంచి ఆసియా ఖండానికి చెందిన 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు. 2010లో భారత్ 35 క్రీడాంశాల్లో పోటీపడగా.. ఈసారి ఆసంఖ్య 28కి పడిపోయింది. ఇక ఇంచియాన్‌లో పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. మొత్తం 516 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో బరిలో ఉన్నారు. అలాగే 2018లో జరగబోయే ఆసియా గేమ్స్‌కు ఇండోనేసియాలోని జకర్తా ఆతిథ్యమివ్వనుంది.