బోణీ కొట్టిన భారత్, శ్వేతా చౌదరికి కాంస్యం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో వైభవంగా ప్రారంభమైన ఏషియాడ్ గేమ్స్లో భారత క్రీడాకారిణి శ్వేతా చౌదరి తొలి పతాకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది.
ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో శనివారం నుంచి ఆసియా ఖండానికి చెందిన 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు.
2010లో భారత్ 35 క్రీడాంశాల్లో పోటీపడగా.. ఈసారి ఆసంఖ్య 28కి పడిపోయింది. ఇక ఇంచియాన్‌లో పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. మొత్తం 516 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో బరిలో ఉన్నారు. అలాగే 2018లో జరగబోయే ఆసియా గేమ్స్‌కు ఇండోనేసియాలోని జకర్తా ఆతిథ్యమివ్వనుంది.