
షూటింగ్‌లో భారత స్టార్స్ మళ్లీ మెరిశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ స్వర్ణం... ఓం మితర్వల్ కాంస్యం గెలిచారు. ఫైనల్లో జీతూ రాయ్ 235.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఓం మితర్వల్ 214.3 పాయింట్లు సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు.
రజతంతో ముగించిన లిఫ్టర్లు..
వెయిట్‌లిఫ్టింగ్ పోటీల చివరి రోజు భారత్‌కు రజతం లభించింది. పురుషుల 105 కేజీల విభాగంలో ప్రదీప్ సింగ్ మొత్తం 352 కేజీల (స్నాచ్‌లో 152+క్లీన్ అండ్ జెర్క్‌లో 200) బరువెత్తి రజత పతకం గెలిచాడు. ఓవరాల్‌గా ఈ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించడం విశేషం.