
తిరువనంతపురం: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షూటర్ జీతూరాయ్ పసిడి గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్ పోరులో రికార్డు స్థాయిలో 233 పాయింట్లు సాధించి పసిడితో మెరిశాడు. ఈ ఫైనల్ ఈవెంట్‌లో జీతూరాయ్ సాధించిన 233 స్కోరే అత్యధికం కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు ఓంకార్ సింగ్ (222.4), జై సింగ్ (198.4) వరుసగా రజతం, కాంస్యం దక్కించుకున్నారు.
జట్టు విభాగంలో జీతూ, ఓం ప్రకాశ్, జై సింగ్‌ల బృందం 1658 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. ఎయిర్ ఫోర్స్ జట్టు (1626)కు రజతం, పంజాబ్ (1624) కాంస్యం దక్కాయి. జూనియర్ పురుషుల విభాగంలో అర్జున్ సింగ్ చిమా 226.5 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. సురీంద్ సింగ్ (221.9), అమోల్ జైన్ (205.1) తో రజత, కాంస్యాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment