కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటింగ్ క్రీడాంశంలో మరో పతకం సాధించింది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటింగ్ క్రీడాంశంలో మరో పతకం సాధించింది. మంగళవారం భారత షూటర్ మానవజిత్ సంధు కాంస్య పతకం సాధించాడు.
పురుషుల ట్రాప్ కాంస్య పతకం పోరులో సంధు.. ఆస్ట్రేలియా షూటర్ మైకేల్ డైమండ్ను ఓడించి పతకం సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ హర్ప్రీత్ సింగ్ రజత పతకం నెగ్గాడు. ఇంతకుముందు భారత షూటర్లు 12 పతకాలు సాధించారు. షూటింగ్లో భారత్కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది.