![21st Olympic berth for India in shooting](/styles/webp/s3/filefield_paths/shooting.jpg.webp?itok=2xPLEzoO)
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది. దాంతో భారత్‌కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది.
దోహాలో ఆదివారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్‌ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment