ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.
మూడు రౌండ్లలో మనీష్ 234.9 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన జియోంగ్డు జో గోల్డ్‌మెడల్ సొంతం చేసుకోగా.. చైనా షూటర్ యాంగ్ చావో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు.
మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు ఇవాళ(శుక్రవారం) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో మొత్తం 4 పతకాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment