పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన స్వప్నిల్ కుసాలె కాంస్య పతకం సాధించాడు. ఈ పతకంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. భారత్ సాధించిన మూడు పతకాలు షూటింగ్‌లో సాధించనవే కావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనూ భాకర్-సరబ్‌జోత్ జోడీ కాంస్య పతకాలు సాధించారు.
ఎవరీ స్వప్నిల్ కుసాలె..?
29 ఏళ్ల స్వప్నిల్ కుసాలె మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు సమీపంలో గల కంబల్‌వాడి అనే గ్రామంలో పుట్టిపెరిగాడు. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అతనికి 12 ఏళ్లు పట్టింది. స్వప్నిల్ అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి ఔరా అనిపించాడు. ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్ స్వప్నిల్ కుసాలేనే కావడం విశేషం.
మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని స్పూర్తితో..!
స్వప్నిల్ కుసాలే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి ప్రేరణ పొందాడు. ధోనిని ఆరాధిస్తాడు. స్వప్నిల్ కూడా ధోనిలాగే కెరీర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్‌గా పని చేశాడు. ధోని బయోపిక్‌ను స్వప్నిల్ చాలాసార్లు చూశాడు. అతని స్పూర్తితో విజయాలు సాధించాలని కలలు కనేవాడు. ఎట్టకేలకు స్వప్నిల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.
ధోనిలాగే ఓపికగా, ప్రశాంతంగా ఉంటాడు..!
షూటర్‌కు ఓపిక, ప్రశాంతత చాలా అవసరం. ఈ రెండు లక్షణాలు స్వప్నిల్‌లో మెండుగా ఉన్నాయి. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ధోనిలోనూ ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. వాస్తవానికి ధోని సక్సెస్‌కు ఈ రెండు లక్షణాలే ప్రధాన కారణం. అతనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అని బిరుదు కూడా ఉంది. ఇప్పుడు స్వప్నిల్ ధోనిని స్పూర్తిగా తీసుకుని భారత్‌కు పతకం సాధించి పెట్టాడు.
స్వప్నిల్ కుటుంబ నేపథ్యం
స్వప్నిల్ తండి, సోదరుడు ప్రభుత్వ టీచర్లు. స్వప్నిల్ తల్లి కంబల్‌వాడి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment