టీ షర్ట్‌తో క్యాజువల్ లుక్... ఎడమ చేయి ప్యాంట్ జేబులో... లక్ష్యాన్ని స్పష్టంగా చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన లెన్స్‌లు లేవు, ఐ కవర్ లేదు, పక్కనుంచి వచ్చే కాంతి నుంచి తప్పించుకునేందుకు వైజర్ పెట్టుకోలేదు, ఇయర్ ప్రొటెక్షన్ లేదు. లక్ష్యంపై గురి...ట్రిగ్గర్‌పై వేలు... నొక్కితే దేశానికి రజత పతకం వచ్చేసింది!
టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ ఒక్కసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. సాధారణంగా షూటర్లు పోటీలో దిగినప్పుడు తమతో పాటు ధరించే సరంజామా ఏదీ అతను వాడలేదు. ఏదో అలా వ్యాహ్యాళికి వెళుతూ బొమ్మ తుపాకీతో సంతలో బెలూన్లను కొట్టినంత అలవోకగా అతను బుల్లెట్‌లను దించేయడం విశేషం.
టర్కీ ఆర్మీలో సైనికుడైన 51 ఏళ్ల యూసుఫ్ హాలీవుడ్ సినిమాల స్టయిల్‌ను గుర్తుకు తెచ్చేలా షూటింగ్ చేశాడంటూ కామెంట్లు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో తర్హాన్‌తో కలిసి యూసుఫ్ రజతం సాధించాడు. షూటింగ్‌లో టర్కీకి ఇదే తొలి మెడల్.
Comments
Please login to add a commentAdd a comment