వెనిజులా షూటర్ అరుదైన ఘనత
పారిస్: ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల విజయగాథలే కాదు... వీటిలో పాల్గొనే వారిలో ఎన్నో భిన్నమైన, ఆసక్తికర నేపథ్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వెనిజులాకు చెందిన షూటర్ లియోనెల్ మార్టినెజ్ పారిస్‌లో ట్రాప్ ఈవెంట్‌లో పోటీ పడ్డాడు. ఓవరాల్‌గా 28వ స్థానంతో ముగించాడు. అయితే అతను పోటీల్లో పాల్గొనడం విశేషం కాదు... 60 ఏళ్ల వయసున్న మార్టినెజ్ 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగడమే అసలు ఘనత! 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మార్టినెజ్ పాల్గొన్నాడు.
ఆ తర్వాత ఆటకు దూరమై పలు వ్యాపారాల్లో స్థిరపడ్డాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ షూటింగ్ వైపు మనసు మళ్లింది. మొదటి నుంచి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న మారి్టనెజ్‌కు మరోసారి క్రీడల్లోకి అడుగు పెట్టడం కష్టం కాలేదు. తన షూటింగ్‌కు పదును పెట్టుకున్న అతను 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలనేదే మారి్టనెజ్ తర్వాతి లక్ష్యం.
అప్పటికి 64 ఏళ్లు వచ్చినా సరే... ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను అంటూ అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మారి్టనెజ్‌కు ముందు జపాన్ ఈక్వె్రస్టియన్ ఆటగాడు హొకెసు హిరోషి మాత్రమే రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం (44 ఏళ్లు) తీసుకున్నవాడిగా నిలిచాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మళ్లీ బరిలోకి దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment