ఇలాంటి ప్రాంతాలను రక్షించుకోవడం మన బాధ్యత: ఎస్ఎస్ రాజమౌళి | Tollywood Director SS Rajamouli Shares A Video From Odisha Goes Viral | Sakshi
Sakshi News home page

SS Rajamouli: అద్భుతమైన ప్రాంతం.. అలా చూసి నిరుత్సాహానికి గురయ్యా: రాజమౌళి

Published Thu, Mar 20 2025 2:55 PM | Last Updated on Thu, Mar 20 2025 3:04 PM

Tollywood Director SS Rajamouli Shares A Video From Odisha Goes Viral

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఒడిశాలోని కోరాపుట్‌ పర్వత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్యాకప్ చెప్పేసింది. దీంతో మూవీ టీమ్‌ అంతా తమ లోకేషన్ నుంచి తిరుగుపయనమయ్యారు. ప్రియాంక చోప్రా తాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

తాజాగా ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ షూటింగ్‌ లోకేషన్‌ సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్లు వెల్లడించారు. పైనుంచి చూస్తే అత్యంత ఉల్లాసభరితంగా అనిపించిందని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

అయితే ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం ‍అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలి.. ఒక ఒక్కరూ పౌరుడు బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుంది... ప్రతి సందర్శకుడు ఇలాంటి ఆహ్లాదకరమైన స్థలాలను రక్షించడంలో సహాయపడటానికి  మీ వ్యర్థాలను  తిరిగి మీరే తీసుకువెళ్లాలని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement