
స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ, సినిమా హిట్ అయితే నిర్మాతకు భారీగానే లాభాలు వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం హీరోల అధిక రెమ్యునరేషన్‌లు చిత్ర పరిశ్రమ మనుగడకు ఇబ్బందిగా మారుతోందని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అధిక నష్టాల ఎఫెక్ట్ వల్ల కొత్తగా నిర్మాతలు ఎవరూ కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
రీసెంట్‌గా తీరని నష్టాల వల్ల లైకా ప్రొడక్షన్స్ సంస్థను షట్‌డౌన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం సినిమా బడ్జెట్ పెరగడమే అని చెప్పవచ్చు. అందులో అధిక భాగం హీరో రెమ్యునరేషన్ అనే ఎక్కువమంది చెబుతున్న మాట. అయితే, ఈ రెమ్యూనరేషన్ మోడల్ మొత్తంగా మహేష్‌బాబు మార్చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే, అది నిర్మాతలకు భారీ ఊరటను కల్పించేలా ఉండటంతో ప్రిన్స్ మహేష్ బాబును అభినందిస్తున్నారు.

నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్
దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రూ. 300 కోట్లతో (పుష్ప2) టాప్‌లో ఉన్నారు. అయితే, పుష్ప2 మూవీకి భారీ లాభాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ రిజల్ట్‌లో తేడా వచ్చింటే ఎవరూ ఊహించలేని నష్టాలను ఆ చిత్ర నిర్మాణ సంస్థ భరించాల్సి వచ్చిండేది. ఇప్పుడు మహేష్‌బాబు- రాజమౌళి (SSMB29) ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ మూవీ కోసం మహేష్‌బాబు తన రెమ్యునరేషన్‌గా సినిమాకు ఫైనల్‌గా వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా లాభాల్లో 35 శాతం వరకు ఉండోచ్చని సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతుంది.
సినిమాకు నష్టాలు వస్తే జీరో రెమ్యనరేషన్ అని ముందే డీల్ సెట్ చేసుకున్నారట.. ఇదే ప్లాన్‌ను దర్శకులు రాజమౌళి కూడా అనుసరిస్తున్నారట. అసలు రెమ్యూనరేషన్ అంటూ తీసుకోకుండా కేవలం వచ్చే ప్రాఫిట్‌లో షేర్ తీసుకోవడం నిర్మాతలకు భారీ ఊరట కల్పించే అంశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్‌లో ఇదే దారిలో చాలామంది హీరోలు వెళ్లే అవకాశం ఉంది. రెమ్యునరేషన్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment