బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్‌మర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో నెయ్‌మర్ నిర్మించిన మాన్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు అతనికి భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి నెయ్‌మర్‌కు పర్యావరణ అధికారులు బిగ్‌షాక్ ఇచ్చారు.
నెయ్‌మర్ కొత్తగా నిర్మించిన తన మాన్షన్ హౌస్ వెలుపల ఒక కృత్రిమ సరస్సును నిర్మించాడు. అతని చర్యపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పర్యావరణానికి హానీ కలిగించేలా నిబంధనలు ఉల్లఘించి మాన్షన్ బయట కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ నెయ్‌మర్‌కు 3.3 మిలియన్ యూఎస్ డాలర్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.27.1 కోట్లు) జరిమానా విధించారు. ఈ విషయాన్ని అధికారులు ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు.
''నిబంధనల ప్రకారం మాన్షన్‌లో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించుకోవచ్చు. కానీ నెయ్‌మర్ తన విలాసాల కోసం పర్యావరణానికి హానీ కలిగిస్తూ కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటి?. రూల్స్‌కు విరుద్దంగా నదీ ప్రవాహాన్ని సంగ్రహించడం చట్టరిత్యా నేరం. అనుమతి లేకుండా నదీ ప్రవాహాన్నిమళ్లించడం.. కృత్రిమ సరస్సు నిర్మాణం కోసం రాళ్లు, ఇసుకను అక్రమంగా తరలించడం.. పర్యావరణ బోర్డు అనుమతి లేకుండానే వృక్షసంపదను అణచివేయడమనేది నేరం కిందే లెక్క. ప్రభుత్వ చట్టాలను పాటించకుండా నిషేధాజ్ఞలను ఉల్లఘించినందుకు గానూ నెయ్‌మర్‌పై చర్యలు తీసుకుంటున్నాం. ''అంటూ ప్రకటనలో తెలిపింది.
ఇక నెయ్‌మర్ కుటుంబసభ్యులు మాన్షన్‌లో ఉన్నప్పుడే అధికారులు, పోలీసులు ఎంటరయ్యారు. దీంతో నెయ్‌మర్ తండ్రి అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అధికారులు చుట్టూ కొలతలు తీసుకొని ఎంతమేర పర్యావరణానికి నష్టం కలిగించాడనే దానిపై రిపోర్టు తయారు చేశారు. అనంతరం నోటీసులు అంటించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
Neymar has been fined nearly $3.5 million after Brazilian authorities said that the soccer star’s luxury coastal mansion in southeastern Brazil violated rules in the 'construction of an artificial lake' https://t.co/VE5RVJYSxJ pic.twitter.com/T5rdztMMER
— Reuters (@Reuters) July 5, 2023
ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్‌జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
చదవండి: #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు'
#PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!
Comments
Please login to add a commentAdd a comment