రూ.342 కోట్ల ఆస్తులు జప్తు | Brazilian authorities freezes football star Neymar's assets | Sakshi
Sakshi News home page

రూ.342 కోట్ల ఆస్తులు జప్తు

Published Wed, Feb 17 2016 3:46 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

రూ.342 కోట్ల ఆస్తులు జప్తు

రూ.342 కోట్ల ఆస్తులు జప్తు

సావోపాలో: పన్ను ఎగవేత కేసులో బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్‌కు గట్టి షాకే తగిలింది. ఈ కేసు విచారణలో భాగంగా అతడి యాట్, జెట్‌లతో పాటు మొత్తం 50 మిలియన్ డాలర్ల (రూ.342 కోట్లు) ఆస్తులను జప్తు చేయాల్సిందిగా సావో పాలో ఫెడరల్ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

నెయ్‌మార్ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాల్లో 2011 నుంచి 2013 వరకు 16 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.110 కోట్లు) పన్ను ఎగవేతకు పాల్పడినట్టు తేలింది. అయితే  బకాయిపడిన మొత్తాన్ని చెల్లిస్తే నెయ్‌మర్ జైలుకు వెళ్లే అవకాశాలు ఉండవని బ్రెజిల్ ఫెడరల్ టాక్స్ ఏజెన్సీ ఆడిటర్ ఇయాగరో జంగ్ మార్టిన్స్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement